2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి పాకిస్తాన్ జట్టు ముందుగానే నిష్క్రమించింది. బంగ్లాదేశ్‌తో ఈరోజు జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకుందామనుకున్న పాక్.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. దీంతో.. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి ఔటయింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. తమ ప్రదర్శనపై సాకులు వెతకడం లేదని అన్నారు. ఈ టోర్నీలో తమ అభిమానుల అంచనాలను అందుకోలేదని రిజ్వాన్ నిరాశ వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ గ్రూప్ Aలో మూడు మ్యాచ్‌లలో రెండు ఓటములతో1.087 నికర రన్ రేట్‌తో చివరి స్థానంలో నిలిచింది. దీంతో.. టోర్నమెంట్ చరిత్రలో చెత్త రికార్డును సాధించిన మొదటి ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది.
Read Also: CM Chandrababu: ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించనున్న ఏపీ సర్కార్
తమ జట్టుపై చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయని.. కానీ వాటిని తాము అందుకోలేకపోయామని రిజ్వాన్ చెప్పాడు. ఇది తమకు నిరాశ కలిగించిందన్నారు. న్యూజిలాండ్‌తో తమ తదుపరి మ్యాచ్‌లో తమ తప్పులను సరిదిద్దుకుంటామని రిజ్వాన్ తెలిపాడు. మరోవైపు.. గాయాలు, ఒత్తిడి కారణంగా జట్టు మెరుగ్గా రాణించలేకపోయిందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో బాగా రాణించిన సయీమ్ అయూబ్, ఫఖర్ జమాన్ గాయపడ్డాడు.. కానీ జట్టు ఓటములకు దీనిని సాకుగా చెప్పడం లేదని తెలిపాడు.
Read Also: Hyderabad: పెండిగ్ చలానా కోసం నా కారు ఆపుతావా? నీకు ఎన్ని గుండెలు..!
జట్టు క్రికెట్ మెరుగుదల గురించి రిజ్వాన్ మాట్లాడుతూ.. “పాకిస్తాన్ జట్టు బలాన్ని మనం కచ్చితంగా గుర్తించాలి. ఇతర జట్లతో పోటీ పడటానికి మేము అవగాహన, వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవాలి” అని రిజ్వాన్ పేర్కొన్నాడు. 29 సంవత్సరాల తర్వాత సొంతగడ్డపై ఈ టోర్నమెంట్ ఆడిన పాకిస్తాన్.. తమ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి జట్టు మధ్యలోనే నిష్క్రమించింది. దీంతో.. పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ అభిమానులే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితిని పునరావృతం కాకుండా చూసుకోవడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) జాతీయ జట్టులో పెద్ద పునర్నిర్మాణం చేయాల్సి ఉంటుంది.