పాకిస్తాన్ 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ (ICC) ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. గురువారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. దీంతో.. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు చివరి స్థానంలో నిలిచింది.
Read Also: Prabhas-Mohanababu: మోహన్ బాబును ఆట పట్టించిన ప్రభాస్.. వీడియో వైరల్
ఈ ఫలితంతో పాకిస్తాన్ జట్టుపై చెత్త రికార్డు నమోదైంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఆతిథ్యం వహిస్తున్న దేశం గెలవకపోవడం ఇదే మొదటిసారి. గత 23 ఏళ్లలో ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 2013లో ఇంగ్లాండ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో కూడా పాకిస్తాన్ జట్టు విజయం లేకుండా, ఒక్క పాయింట్ కూడా సాధించకుండా, టోర్నమెంట్‌ను ముగించింది. కాగా.. చివరిసారిగా 2000లో కెన్యా ఈ చెత్త రికార్డును నమోదు చేసింది.
Read Also: Israel: ఇజ్రాయిల్‌లో ఉగ్రదాడి.. పాదచారులపైకి వాహనం..
ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేత ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం నెమ్మదిగా ఆడటం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తరువాత, భారత్ తో తలపడిన పాకిస్తాన్.. 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఓడిపోయి టోర్నమెంట్ నుండి నిష్క్రమించాయి. ఈ విధంగా రెండు జట్లు తమ అభిమానులను నిరాశపరిచాయి.