2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్.. ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా.. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం టీమిండియాకు చాలా గ్యాప్ దొరికింది. భారత్, న్యూజిలాండ్ మధ్య మార్చి 2న సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. గత ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్ టీమిండియాను ఇబ్బంది పెట్టింది. కాగా.. ఈ మ్యాచ్ కోసం అభిమానులు, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
Read Also: Idli-making: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ నిషేధం.. క్యాన్సర్ కారకమని మంత్రి హెచ్చరిక..
అయితే.. ఈ మ్యాచ్ కోసం భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని తెలిపాడు. న్యూజిలాండ్ జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్లు ఉన్నందున, సుందర్‌ను టీమ్‌లోకి తీసుకుంటే మంచి ఎంపిక అవుతాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కైఫ్ ట్వీట్ చేస్తూ, “వాషింగ్టన్ సుందర్‌ను న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అవకాశమిచ్చే ఆలోచన తప్పు కాదు. ఎందుకంటే వారి జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉన్నారు. కాన్వే, రచిన్, లాథమ్, బ్రేస్‌వెల్, సాంట్నర్ వంటివారు భారత్ తో ఫైనల్స్‌లో తలపడే అవకాశం ఉంది. కాబట్టి వాషింగ్టన్‌ను పరీక్షించడం సరైనది,” అన్నారు.
Read Also: Vallabhaneni Vamsi: జడ్డి ముందు వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు..
ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఆ మ్యాచ్‌లో 43 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీకి సుందర్ స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ.. ఒక మ్యాచ్‌లో కూడా ఆడే ఛాన్స్ రాలేదు.