ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో టోర్నీలో 9వ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. నిరంతర వర్షం, తడి అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడలేదు. టాస్ పడకముందు నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికీ ఎడతెరిపి ఇవ్వకపోవడంతో అంఫైర్లు మ్యాచ్ రద్దు చేశారు.
Read Also: Akshay Kumar: ‘కన్నప్ప’ ను రెండు సార్లు తిరస్కరించా.. విష్ణు, మోహన్‌బాబు ఫోన్ చేసినా..
ఈ టోర్నమెంట్‌లో పాక్-బంగ్లా జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఓడాయి. ఇప్పటికే ట్రోఫీ నుంచి పాక్, బంగ్లా ఎలిమినేట్ అయ్యాయి. కాగా.. ఈ మ్యాచ్ కేవలం లాంఛనప్రాయమే అయినప్పటికీ.. వరుణుడు అడ్డంకి కలిగించాడు. మరోవైపు.. 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్‌ను దాటడంలో విఫలమైన పాకిస్తాన్.. మూడోసారి ప్రపంచ పరిమిత ఓవర్ల క్రికెట్ పోటీలో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ICC టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్.. గ్రూప్ Aలో బంగ్లాదేశ్ తర్వాత ఒక పాయింట్, నెగటివ్ నికర రన్ రేట్ (-1.087)తో అట్టడుగున నిలిచింది. అటు.. బంగ్లాదేశ్ జట్టు కూడా బౌలింగ్, ఫీల్డింగ్‌లో సగటుగానే ప్రదర్శించింది. టోర్నమెంట్‌లో అంతగా మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో.. ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాయి.
Read Also: DC: ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కెవిన్ పీటర్సన్..
కరాచీలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌తో తలపడిన మహ్మద్ రిజ్వాన్ సేన.. 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అటు.. బంగ్లాదేశ్ మొదటగా భారత్ చేతిలో, తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది.