రీల్స్ పిచ్చి మరో ప్రాణం తీసింది. పని పక్కన పడేసి రీల్స్ చేస్తుందన్న కోపంతో భార్యను చంపేశాడు భర్త. అనంతరం మృతదేహాన్ని మూటగట్టి బాత్‌రూంలో పడేసి మూడేళ్ల బాలుడిని తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన ఉప్పల్ లో మూడు రోజుల క్రితం జరిగింది. కాగా.. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ చేస్తూ తనను పట్టించుకోవడం లేదని.. భార్యతో భర్త తరుచూ గొడవ పడేవాడు. అంతేకాకుండా.. రీల్స్ ముసుగులో వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. రీల్స్ మానేయమని చాలాసార్లు…
ఆసరా పెన్షన్‌ను తిరిగి చెల్లించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులు ఇవ్వడంపై మంత్రి సీతక్క స్పందించారు. కొత్తగూడెం మున్సిపాలిటికి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పెన్షన్ అందుతోందని తెలిపారు. అయితే దాసరి మల్లమ్మ కుమార్తె రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం(ANM) గా పనిచేస్తూ మరణించగా, ఫ్యామిలి పెన్షన్ కింద నెలకు రూ. 24,073 పెన్షన్ మల్లమ్మకు అందుతోందని మంత్రి పేర్కొన్నారు.
ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, లష్కర్‌గూడ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగారం హైవే ట్రీట్ సమీపంలో 163 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతులు వాజేడు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో.. కాకర్లపూడి సత్యనారాయణ రాజు, భార్య సత్యవతి ఉన్నారు. అయితే.. తమ కూతురు అనితను వైజాగ్ వెళ్లేందుకు బస్ ఎక్కించడం కోసమని బస్టాండ్ కు…
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మరి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొందరు కూడా పార్టీ మారుతారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్‌కు బైబై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై వద్దిరాజు రవిచంద్ర స్పందించారు.
గిగ్లైజ్ కంపెనీ సీఈవోను కిడ్నాప్ చేయలేదని బాధిత నిరుద్యోగులు, జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులు ఎన్టీవీతో చెప్పారు. నిరుద్యోగులు అందరం జాగృతి కన్సల్టెన్సీ, SLC కన్సల్టెన్సీ వెంకట్కి ఐటీ ఉద్యోగం కోసం డబ్బులు కట్టామని తెలిపారు. చాలా మంది వద్ద రూ. 2 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారు.. కన్సల్టెన్సీల నుండి కోట్ల రూపాయలు దండుకుని ఉద్యోగం కల్పిస్తామని చెప్పి గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డి బోర్డు తిప్పేసారని వారు ఆరోపిస్తున్నారు.
భారత్ జింబాబ్వే మధ్య ఈరోజు నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మొదట జింబాబ్వే బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత్ ముందు 153 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
హైదరాబాద్ జేఎన్టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగోను సీఎం విడుదల చేశారు.
గ్రూప్-1పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. టీజీఎస్పీఎస్సీ పారిదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు కొందరు 1:100 పిలవాలని కోరుతున్నారు.. తమకేం ఇబ్బంది లేదు పిలవడానికి.. కానీ కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుందనిన సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్ 1 వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది.. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని తేల్చి చెప్పారు.
ఇండియా-జింబాబ్వే మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. అందులో భాగంగా ఈరోజు నాల్గవ టీ20 మ్యాచ్ ఉండనుంది. హరారే వేదికగా ఈ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. జట్టులో ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. తుషార్ దేశ్‌పాండే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు.