1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత క్రికెట్ జట్టుకు చారిత్రాత్మకమైనది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 39 ఏళ్ల క్రితం భారత ఆటగాళ్లు ప్రపంచకప్ గెలిచినప్పుడు వారి జీతాలు చాలా తక్కువగా ఉండేవని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1983 నాటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణ పాఠశాలల్లో ప్రహరీ కమిటీలు వేయనున్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలలు, విద్య, శిశు సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాలలో మాదకద్రవ్యాల విక్రయాలను ఆపడానికి ప్రహరీ కమిటీలు పనిచేయనున్నాయి. అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుండి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లు నిర్మించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సోమాజిగూడలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఈటల ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో ఓ తోటమాలి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. మామిడికాయలు కోయడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులపై బరితెగించాడు. తోటమాలి పిల్లలను తాడుతో చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మేలుకుని.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
యూపీలోని మీరట్‌కు చెందిన ఓ యువకుడు బరేలీ జిల్లాకు చెందిన ఓ మహిళను ప్రేమించాడు. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయం కాస్త.. ఫోన్లు మాట్లాడటం వరకు వచ్చింది. ఆ తర్వాత.. యువకుడు మహిళను కలిసేందుకు ఇంటికి రావడం కూడా ప్రారంభించాడు. వీరిద్దరి మధ్య ఇంతటీ కథ నడుస్తుందని.. మహిళ భర్తకు తెలయదు. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిపోగానే.. మహిళ యువకుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఒకరోజు మహిళను కలిసేందుకు ప్రేమికుడు తన ఇంటికి వచ్చాడు. వారిద్దరూ…
ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లయ్ అవుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఎక్కువ శాతం డ్రగ్స్ యూజ్ చేసేది పబ్ లోనేనని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని పబ్ లు ఉన్నాయో.. ప్రతి ఒక్క పబ్బుల్లో డ్రగ్స్ సప్లయ్ అవుతుందని తెలిపారు.
బీహార్‌లోని బెగుసరాయ్‌లో మేనమామ తన సొంత మేనకోడలిపై హత్యచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జహాన్‌పూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు డయల్-112కు సమాచారం అందింది.
ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
పావురాలను ఎక్కువగా ఇళ్లల్లో పెంచుకుంటారు. అంతేకాకుండా.. ఇంటిపై స్థావరాలను ఏర్పరుచుకుని విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని చోట్ల రోడ్లపై వీపరీతంగా వాలుతూ ఉంటాయి. అయితే.. పావురం ఈకలు, రెట్టలతో ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఒక అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చింది. పావురం ఈకలు, రెట్టలతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా చిన్నారులు, యువత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.