ఆసరా పెన్షన్‌ను తిరిగి చెల్లించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులు ఇవ్వడంపై మంత్రి సీతక్క స్పందించారు. కొత్తగూడెం మున్సిపాలిటికి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పెన్షన్ అందుతోందని తెలిపారు. అయితే దాసరి మల్లమ్మ కుమార్తె రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం(ANM) గా పనిచేస్తూ మరణించగా, ఫ్యామిలి పెన్షన్ కింద నెలకు రూ. 24,073 పెన్షన్ మల్లమ్మకు అందుతోందని మంత్రి పేర్కొన్నారు. మల్లమ్మ ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా.. మరొకరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారన్నారు. కుమారుడితో పాటు సొంత పక్కా ఇంట్లో మల్లమ్మ నివసిస్తుందని.. అయితే ఒకే వ్యక్తి రెండు రకాల పెన్షన్లు తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవని మంత్రి సీతక్క తెలిపారు.
PM Modi: ప్రతిపక్షాల ఫేక్ ప్రచారంపై ప్రధాని మోడీ ఫైర్..
రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, ఫ్యామిలి పెన్షన్లను 1826 మంది పొందుతున్నట్లు ట్రెజరీ శాఖ ఈ మధ్యనే గుర్తించి వారందరికి రికవరీ నోటీసులు పంపింది. ఆ ప్రక్రియలో భాగంగానే వృద్ధాప్య, ఫ్యామిలి పెన్షన్లను అందుకుంటున్న దాసరి మల్లమ్మకు సైతం అధికారులు నోటీసులు పంపారు. వాస్తవాలు ఈ రకంగా ఉంటే, ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్న కొందరు ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎందరో అర్హులకు పెన్షన్లు అందించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ఒక పంట కూడా సరిగా పండని అడవిలో కొండలు, గుట్టలతో కూడిన పోడు భూమి 5 ఎకరాలకు మించి ఉందన్న కారణం చూపి ఇచ్చిన పెన్షన్లను గత ప్రభుత్వం రద్దు చేసిందని సీతక్క తెలిపారు.
Bharateeyudu 2: చేతులు కాలాక భారతీయుడు 2 టీం కీలక నిర్ణయం
ఆటోలు, కార్లు నడుపుకుని బతికే కుటుంబాలకు రేషన్ కార్డుతో పాటు పెన్షన్లకు కోతలు పెట్టిందని.. కానీ తమ ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచిస్తోందని మంత్రి తెలిపారు. అర్హులందరికి పెన్షన్ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ సంకల్పం అన్నారు. అందులో భాగంగానే లీకేజీలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు లబ్దిదారుల జాబితాను అప్ డేట్ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ.. సంక్షేమ ఫలాలు అర్హులకు, అవసరం ఉన్నవాల్లకే దక్కేలా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మానవీయకోణంలో పాలన సాగిస్తున్నామని చెప్పారు. దాసరి మల్లమ్మ విషయంలో రెండు రకాల పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిబంధనలు అంగీకరించవన్న విషయాన్ని గుర్తెరిగి వ్యవహరించాలని కోరుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు.