సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటింది. దాన్ని ఎంత మంచికి ఉపయోగిస్తే అంత మంచిది. కాదని చెడుకు వినియోగిస్తే.. అది ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా కారణంగా అతి సామాన్యులు, పేదలు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వురులైన తమ పేదరికాన్ని జయించిన సంఘటనలు ఎన్నో చూశాం. అయితే అదే సోషల్ మీడియా కారణంగా ప్రాణాలు తీసుకున్న వారిని చూశాం. ప్రాణాలు తీసిన వారిని చూస్తున్నాం. తాజాగా.. హైదరాబాద్ లో రీల్స్ పిచ్చి ఓ మహిళ ప్రాణాలు పోయేలా చేసింది.
Tea : టీ తాగితే తలనొప్పి తగ్గుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
వివరాల్లోకి వెళ్తే.. రీల్స్ పిచ్చి మరో ప్రాణం తీసింది. పని పక్కన పడేసి రీల్స్ చేస్తుందన్న కోపంతో భార్యను చంపేశాడు భర్త. అనంతరం మృతదేహాన్ని మూటగట్టి బాత్‌రూంలో పడేసి మూడేళ్ల బాలుడిని తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన ఉప్పల్ లో మూడు రోజుల క్రితం జరిగింది. కాగా.. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ చేస్తూ తనను పట్టించుకోవడం లేదని.. భార్యతో భర్త తరుచూ గొడవ పడేవాడు. అంతేకాకుండా.. రీల్స్ ముసుగులో వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. రీల్స్ మానేయమని చాలాసార్లు చెప్పిన వినకపోవడంతో.. దీంతో భార్య మదుస్మితను భర్త ప్రదీప్ హత్య చేశాడు.
Karnataka: కూతురి ప్రైవేట్ వీడియోలు వైరల్ చేసిన తండ్రి.. ఆత్మహత్యాయత్నం..
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్ లో జరిగిన ఈ మర్డర్ కేసును ఉప్పల్ పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. ఉప్పల్, న్యూ భరత్ నగర్ లో ఐదు నెలలుగా ఓ హోటల్లో పనిచేస్తున్న మధు స్మిత, ప్రదీప్ బోలా దంపతులు అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు, ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడం, రీల్స్ చేయడం, ఫోన్ తో గంటలు తరబడి ఉండడంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. అర్ధరాత్రి చపాతి పీటతో తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయిన మధుస్మిత.. తర్వాత చున్నితో ఆమె మెడకు బిగించి హత్య చేశాడు భర్త ప్రదీప్. మృతదేహాన్ని బాత్రూంలో బస్తా సంచిలో ఉంచి తాళం వేసి పరారయ్యాడు. కాగా.. బేగంపేట ఏరియాలో ప్రదీప్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు.