CM Revanth Reddy: గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’.. రేపు సేఫ్టీ కిట్ల పంపిణీ స్కీమ్ ప్రారంభించనున్న సీఎం
- గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’..
- సేఫ్టీ కిట్ల పంపిణీ స్కీమ్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- రేపు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ గ్రామంలో ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, లష్కర్‌గూడ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. గౌడన్నలతో సమావేశం అనంతరం అక్కడే వారితో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: Raj Tarun- Lavanya: లావణ్య-రాజ్‌తరుణ్ వివాహం.. పోలీసులకు ఆధారాలు సబ్మిట్ చేసిన లావణ్య
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో చాలాసార్లు ప్రమాదాల బారిన పడి గీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఆధునికతను జోడించి సేఫ్టీ కిట్లను హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసింది. గీత కార్మికులు సులువుగా తాళ్లు ఎక్కేలా ఈ కిట్లను రూపొందించారు. ప్రమాదవశాత్తు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా ఈ పరికరాల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ఒక్కో కిట్‌లో మొత్తం 6 పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలోనే, యూజర్ ఫ్రెండ్లీగా ఈ పరికరాలు ఉంటాయి.
Read Also: Janasena Active Membership: క్రియాశీలక సభ్యత్వ నమోదుకు సిద్ధమైన జనసేన.. 10 రోజుల పాటు..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..