Job Fraud Case: జూబ్లీహిల్స్ జాబ్ ఫ్రాడ్ కేసులో ట్విస్ట్..
- గిగ్లైజ్ సీఈవో రవిచంద్ర రెడ్డిని కిడ్నాప్ చేయలేదు- జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులు
- చాలా మంది వద్ద 2 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేసారు
- కన్సల్టెన్సీల నుండి కోట్ల రూపాయలు దండుకుని ఉద్యోగం కల్పిస్తామని చెప్పి..
- గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డి బోర్డు తిప్పేసారు- కన్సల్టెన్సీ ఉద్యోగులు
- కోట్ల రూపాయలు వసూలు చేసిన రవిచంద్రా రెడ్డి ఎస్కేప్ అయ్యాడు- బాధితులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిగ్లైజ్ కంపెనీ సీఈవోను కిడ్నాప్ చేయలేదని బాధిత నిరుద్యోగులు, జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులు ఎన్టీవీతో చెప్పారు. నిరుద్యోగులు అందరం జాగృతి కన్సల్టెన్సీ, SLC కన్సల్టెన్సీ వెంకట్కి ఐటీ ఉద్యోగం కోసం డబ్బులు కట్టామని తెలిపారు. చాలా మంది వద్ద రూ. 2 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారని.. కన్సల్టెన్సీల నుండి కోట్ల రూపాయలు దండుకుని ఉద్యోగం కల్పిస్తామని చెప్పి గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డి బోర్డు తిప్పేసారని వారు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు వసూలు చేసిన గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డి పరారయ్యాడని బాధితులు చెబుతున్నారు. అసలు.. తాము రవిచంద్ర రెడ్డిని కిడ్నాప్ చేయలేదని అంటున్నారు.
ఫేక్ ఉద్యోగాలు ఇచ్చి, జీతాలు ఇవ్వకుండా వేధింపులు గురి చేసింది గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డినే అని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగుల నుండి తమకు ప్రెషర్ అవడంతో రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లినట్లు జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులు తెలిపారు. దీంతో.. అతనితో మాట్లాడేందుకు బయటకు తీసుకెళ్లారు.. ఫామ్ హౌస్ లో సెటిల్ చేసుకుందామని రవిచంద్ర రెడ్డి జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులతో వెళ్ళాడని బాధితులు తెలిపారు. అంతలోనే రవిచంద్ర రెడ్డి తన తల్లికి ఫోన్ చేసి జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులపై కిడ్నాప్ కేసు పెట్టించాలని కోరాడన్నారు. ఫిర్యాదు అందిన 5 గంటల్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. దీంతో.. జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులపై రవిచంద్ర రెడ్డి తల్లి కావాలనే కిడ్నాప్ కేసు పెట్టారని బాధితులు చెబుతున్నారు.
Also Read
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
Israel: హమాస్ మిలిటరీ చీఫ్ లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడి.. 71 మంది మృతి..
కాగా.. అంతకుముందు ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. కోట్ల రూపాయలు దండుకుని బోర్డు తిప్పేసిన ‘గిగ్లైజ్’ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డిని కిడ్నాప్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రెండు లక్షలు వసూలు చేసి.. మోసం చేసిన గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డిని కన్సల్టెన్సీ ఉద్యోగులు కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫేక్ ఉద్యోగాలు ఇచ్చి.. జీతాలు ఇవ్వకుండా వేధింపులు గురి చేశాడు రవిచంద్ర రెడ్డి. కాగా.. రవిచంద్ర రెడ్డి కిడ్నాప్ ఫిర్యాదు అందిన 5 గంటల్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు బాధితుడిని గుర్తించడంతో పాటు 8మందిని అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని హుడా ఎన్‌క్లేవ్ నందగిరిహిల్స్‌లో నివసిస్తున్నాడు వాకటి రవిచంద్రారెడ్డి. రాయదుర్గం టీ-హబ్ సమీపంలోని ఆర్బిట్‌మాల్‌లో ‘గిగ్లైజ్’ పేరుతో గత నవంబరులో సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రారంభించాడు. జనవరి నుంచి జీతాలు చెల్లించలేదని కంపెనీ బాధితులు చెబుతున్నారు. ఈ నెల 9న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రవిచంద్రారెడ్డి ఇంటికి ఎనిమిది మంది కన్సల్టింగ్ సిబ్బంది వచ్చి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!