అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మరి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొందరు కూడా పార్టీ మారుతారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్‌కు బైబై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై వద్దిరాజు రవిచంద్ర స్పందించారు.
Read Also: Wedding: కూలర్ వివాదం.. పెళ్లికి నిరాకరించిన వధువు.. వరుడి బాధ వైరల్..
బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీలో తాము చేరుతున్నట్లు.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం అవుతున్నట్లు కొన్ని పత్రికలు, ఛానెళ్లలో వెలువడుతున్న వార్తలు, కథనాలలో ఏ మాత్రం నిజం లేదన్నారు. అవి అభూత కల్పనలు అని ఎంపీ రవిచంద్ర కొట్టిపారేశారు. టీవీ ఛానెల్స్ కొన్ని బీఆర్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, బలహీనపర్చేందుకు అదే పనిగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచారం చేయడం తీవ్ర విచారకరమని ఎంపీ వద్దిరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నలుగురు ఎంపీలు ఎవరు బీజేపీలోకి వెళ్లారని.. ఇది మైండ్ గేమ్ పాలిటిక్స్ అని ఆయన తెలిపారు.
Read Also: Anant Ambani Wedding: రాధిక మర్చంట్ వెడ్డింగ్ రింగ్ వైరల్.. స్పెషల్ ఏంటంటే..!