Mulugu Road Accident: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడిక్కడే మృతి
- ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఏటూరునాగారం హైవే ట్రీట్ సమీపంలో ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
- ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగారం హైవే ట్రీట్ సమీపంలో 163 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతులు వాజేడు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో.. కాకర్లపూడి సత్యనారాయణ రాజు, భార్య సత్యవతి ఉన్నారు. అయితే.. తమ కూతురు అనితను వైజాగ్ వెళ్లేందుకు బస్ ఎక్కించడం కోసమని బస్టాండ్ కు బయలుదేరారు. ఈ క్రమంలో.. ఆటోలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Read Also: No Fish, No Wedding: చేపలు, మాంసాహారం లేదని పెళ్లిలో వధువు కుటుంబంపై దాడి..
Also Read
ప్రమాదంలో.. కూతురు అనితకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ తల్లండి నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మొత్తం ఆటోలో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. పెనుమర్ల రాజిరెడ్డి అనే వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణమైన కంటైనర్ వాహనం CG17KZ5900గా గుర్తించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని జాతీయరహదారిపై ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం మృతదేహాలను అక్కడి నుంచి మార్చురీకి తరలించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!