ఉత్తర ప్రదేశ్లో ఓ పెళ్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. కాబోయే అత్తామామలను వరుడు చెప్పుతో కొట్టాడు. పెళ్లికి ముందు తాగి మండపానికి వచ్చిన వరుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువుకు కోపమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుని అత్తమామల పట్ల గౌరవంగా ఉండాల్సిన వరుడి ప్రవర్తన పట్ల పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
కేరళలోని ఓ ఆస్పత్రిలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి రెండు రోజులుగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. రెండ్రోజులు నరకయాతన అనుభవించిన అతను.. ఈరోజు లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చాడు. ఎన్నిసార్లు అరిచినా అతని అరుపులు బయటి వారికి వినిపించలేదు.
బీహార్‌లోని భోజ్‌పూర్‌లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త టీ చేయమని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో భర్త విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు.
వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయం యొక్క శాస్త్రీయ సర్వే నివేదికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇండోర్ బెంచ్‌కు సోమవారం సమర్పించింది. ASI తరపు న్యాయవాది హిమాన్షు జోషి 2000 పేజీల నివేదికను హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించారు. కాగా.. ఈ కేసును జులై 22న హైకోర్టు విచారణ జరుపుతుందని తెలిపారు.
జూలై 13న అదృశ్యమైన పారిశుధ్య కార్మికుడి మృతదేహం కేరళ రాజధాని తిరువనంతపురంలోని కాలువలో సోమవారం ఉదయం లభ్యమైంది. శనివారం రోజున అమైజాంచన్ కాలువను శుభ్రం చేస్తుండగా పారిశుధ్య కార్మికుడు జాయ్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నావికాదళం, స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సోమవారం ఉదయం అతడి కోసం గాలింపు చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
విద్యుత్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నారు. ఈ క్రమంలో.. రేపు సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యుత్ కమిషన్ రద్దు కోరుతూ గతంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. కాగా, హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ వేశారు.
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు ప్రక్రియను నిలిపివేశారు అధికారులు. బయటి రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలు తరలించామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. లోపల రత్న భాండాగారం తెరుచుకోకపోవడతో తాళాలు పగలగొట్టి తెరిచినట్లు పేర్కొన్నారు. లోపల రత్న భాండాగారంలో ఆభరణాలన్నీ అల్మారాలు, లాకర్లలో పెట్టారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు బహోదాపూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు విద్యార్థిపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గత రెండు నెలల క్రితం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి హత్యలు చేసిన ఘటన ఎట్టకేలకు హత్య మిస్టరీ వీడింది. రఘునాథపాలెం మండలం హర్యా తండా వద్ద తల్లి ఇద్దరు పిల్లలతో కారు ప్రమాదం భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెందిన ఘటన కనపడింది. అయితే భర్త ప్రవీణ్ హైదరాబాదులో డాక్టర్గా పనిచేస్తూ అక్కడ ఒక కేరళ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నడని ఆరోపణలు ఉన్నాయి.