లార్డ్స్ టెస్టులో వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 371 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో గెలిచింది.
జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్.. 2024 జూలైలో భారత మార్కెట్‌లో విక్రయించే కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్, టైగన్ SUVలపై డిస్కౌంట్లు ఇచ్చింది. కంపెనీ అందిస్తున్న ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపుతో సహా పలు రకాల ఆఫర్లు ఉన్నాయి.
జూన్లో కార్ల విక్రయ గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) విడుదల చేసింది. సియామ్ (SIAM) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2024 జూన్లో భారత మార్కెట్‌లో PV విభాగంలో (హోల్‌సేల్) 3.37 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే గతేడాది జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
బ్రియాన్ లారా తన ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే ఆటగాళ్లు ఎవరు అని అడగ్గా.. అతను చెప్పిన పేర్లలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, జాక్ క్రౌలీ లాంటి ఆటగాళ్లు.. తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగలరని లారా తెలిపాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో వికాస్ దూబే (24) అనే వ్యక్తి మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఏదో ఒకసారో.. రెండుసార్లు కాదు.. 40 రోజుల్లో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు. దీంతో.. వికాస్ దూబే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దూబే గురువారం సాయంత్రం తన మామ ఇంట్లో పాము కాటుకు గురయ్యాడు. కాగా.. జూన్ 2 నుంచి జూలై 6 మధ్య అతన్ని ఆరుసార్లు పాము కాటు వేసింది. తాజాగా మరోసారి పాము…
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ సిరీస్ జూలై 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 జూలై 26న పల్లెకెలెలో జరగనుంది. టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఈ మైదానంలో జరుగనున్నాయి. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతో భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు.
ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. భారత్- శ్రీలంక మధ్య 3 టీ20 ఇంటర్నేషనల్, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అయితే.. టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే లంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వనిందు హసరంగ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధృవీకరించింది.
దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ సరికొత్త రికార్డును సాధించింది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కొత్త మైలురాయిని సాధించింది. ఈ కారు కేవలం 5.5 ఏళ్లలో 10 లక్షల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఈ కారు చాలా నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు యొక్క కొత్త మోడల్ 2019 జనవరి 23న ప్రారంభించారు. అప్పటి నుండి.. ఈ కారు 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
కార్ల తయారీదారు ఫోర్డ్ తన పాత కారు ఫోర్డ్ కాప్రీని కొత్త లుక్ లో ముందుకు తీసుకురానుంది. కంపెనీ ఈ ఫోర్డ్ కాప్రీని ఎలక్ట్రిక్ వేరియంట్‌లో తీసుకురాబోతోంది. దీనిని మాంచెస్టర్ యునైటెడ్- ఫ్రెంచ్ అంతర్జాతీయ ఆటగాడు ఎరిక్ కాంటోనా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ కారు ఐదు డోర్లతో రాబోతుంది. ఇటీవల యూరోపియన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కారుకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
పప్పు ఆరోగ్యానికి మంచిది.. శాకాహారం తీసుకొనే వారికి ఇది మాంసంలోని పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. పప్పులలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి వరంగా భావిస్తారు. అయితే వర్షాకాలంలో కొన్ని పప్పులు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.