గ్రూప్-1పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. టీజీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు కొందరు 1:100 పిలవాలని కోరుతున్నారు.. తమకేం ఇబ్బంది లేదు పిలవడానికి.. కానీ కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుందనిన సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్ 1 వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది.. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని తేల్చి చెప్పారు.
Read Also: Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నిమ్మల
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ పరీక్ష రాయలేనోడు ఉద్యోగాలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. నిన్న మొన్న దీక్ష చేసిన ముగ్గురు.. ఏ ఒక్క పరీక్ష రాసిన దాఖలాలు లేవని అన్నారు. ఏ ఉద్యోగానికి పరీక్ష రాయలేనోడు.. పరీక్షలు వాయిదాలు వేయాలని దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్లు వస్తాయో.. ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తెలియదన్నారు.
Read Also: INDIA bloc: ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభంజనం.. కూటమికి 10, బీజేపీకి 02..
జాబ్ క్యాలెండరు విడుదల తర్వాత ఉద్యోగాలు భర్తీ ఎప్పుడు జరుగుతాయని క్లారిటీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జాబ్ క్యాలెండర్ కి చట్టబద్ధత ఉందన్నారు. మార్చి నెల ఆఖరి వరకు అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పిస్తాం.. ప్రతి ఏడాది ఇదే వ్యవహారం కొనసాగుతుందని సీఎం చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల ఖాళీల ప్రకారం ఎలాగైతే నోటిఫికేషన్లు వస్తాయో.. తెలంగాణలో ఉద్యోగాల ఖాళీల భర్తీ అలాగే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.