జింబాబ్వేతో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా బౌలర్లు మరోసారి అదరగొట్టడంతో గెలుపొందారు. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల కుండపోత వర్షం పడుతుంది. ఉదయం నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణం.. గత గంట నుంచి ఎడతెరిపి లేని వాన పడతుంది. పంజాగుట్ట, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అంబర్‌పేట్, మలక్‌పేట్‌లో భారీ వర్షం కురుస్తుంది.
మాజీ మంత్రి హరీష్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ పొగడతలతో ముంచెత్తారు. ఉద్యమం చేసి ప్రజల్లో అభిమానం ఉన్న నేత అని అన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు.. హరీష్ రావు ప్రజల మనిషి అని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ మాత్రం ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు అంటూ, హరీష్ రావు మంచి నాయకుడు పొగిడారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలతో చర్చలు జరిపారా అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించారు.
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనలు.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని అన్నారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.
జింబాబ్వే జరుగుతున్న చివరి టీ20లో భారత్ 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి జింబాబ్వే ముందు 168 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. భారత్ బ్యాటింగ్లో సంజా శాంసన్ (58) పరుగులతో రాణించాడు.
ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిందని మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. యువకుడు సిద్ధార్థ్ ప్రేమ పెళ్లి చేసుకోగా.. తనకు ఆడపిల్ల జన్మించిందని.. మరో పెళ్లి చేసుకోబోయాడు. ఒక రిసార్ట్ లో మరొక పెళ్లి రెడీ అయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధిత మహిళ కవిత.. ఎలాగైనా పెళ్లిని ఆపుతానని తెలిపింది. ఆడబిడ్డ పుట్టిందని వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. రూ. కోటి కట్నం కావాలని అత్తింటి వారు చిత్రహింసలు పెడుతున్నారని తెలిపింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని.. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం.. ఇంకా 6 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నిరుద్యోగులకు వెంటవెంటనే ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందరూ మంచిగా ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుతున్నామన్నారు.
ఇండియా-జింబాబ్వే మధ్య ఈరోజు ఐదో టీ 20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్కు దిగనుంది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి 4-1 తేడాతో ముగించాలని టీమిండియా చూస్తోంది.
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ సభ్యులు ఈరోజు మధ్యాహ్నం జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి ఖజానాను తెరిచారు.
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హైదరాబాద్కు ఏం చేసింది అంటున్నారు.. 'ఔటర్ తెచ్చింది మేము.. ఐటీ తెచ్చింది మేము.. ఎయిర్ పోర్ట్ కట్టింది మేము' అని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరేం చేశారు.. గంజాయి, డ్రగ్స్ తెచ్చారని బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటే.. కాళ్ళల్ల కట్టే పెట్టే పనిలో వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు. వీళ్ళ పని ఐపోయింది అన్నోడు ఎక్కడ ఉన్నాడు.. కనపడకుండా పోయాడని సీఎం విరుచుకుపడ్డారు.