కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ నివేదిక సమర్పించారు. 'డ్రైవర్ తప్పిదం వల్ల మాత్రమే ప్రమాదం జరగలేదని, రైలు నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ప్రమాదం' అని నివేదిక స్పష్టం చేసింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి డ్రైవర్ కారణమని రైల్వే బోర్డు ఆరోపించింది. అయితే విచారణ నివేదిక అందిన వెంటనే రైల్వేశాఖ అనేక నిర్లక్ష్యానికి సంబంధించిన ఫొటోలు బయటపడ్డాయి. మంగళవారం ప్రత్యేక కమిటీ ప్రమాదంపై విచారణ నివేదికను సమర్పించింది. విచారణ నివేదికలో రైల్వే శాఖలో అనేక లోపాలున్నాయని పేర్కొంది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ మాజీ హెడ్ డిజైనర్ ఇయాన్ కామెరాన్ దారుణ హత్యకు గురయ్యాడు. జర్మనీలోని తన భవనంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ సమయంలో.. అతని భార్య వెరెనా క్లోస్ పక్కనే ఉంది. ఆమె గోడ దూకి తన ప్రాణాలను కాపాడుకుంది. కాగా.. ఈ ఘటనపై ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం ప్రకారం.. అతను జర్మనీలోని హెర్షింగ్‌లోని లేక్ అమ్మర్సీలో ఉన్న తన విలాసవంతమైన భవనంలో ఈ దాడికి గురయ్యాడు. ఈ ఘటన…
జమ్మూ డివిజన్లో జరిగిన దాడుల్లో.. జనవరి 1 నుండి ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడుల్లో ఆర్మీ కెప్టెన్‌తో సహా 12 మంది భద్రతా సిబ్బంది బలి అయ్యారు. ఈ దాడుల్లో 10 మంది పౌరులు మరణించగా, 55 మంది గాయపడ్డారు. ఈ సమయంలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
6,250 మీటర్ల ఎత్తైన మౌంట్ క్యాంగ్ యాట్సీ-2 అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్ని శిఖరంపై నిలబెట్టిన భూక్యా యశ్వంత్.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. మహబూబాబాద్ జిల్లాలో మారుమూలన ఉన్న ఉల్లేపల్లి భూక్యా తండాకు చెందిన గిరిజన యువకుడు, మౌంటేనీర్ భూక్యా యశ్వంత్.. ఇతను పర్వత అధిరోహణలో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించాడు. ఇప్పుడు హిమాలయాల్లో లడఖ్ ప్రాంతంలో ఉన్న 6250 ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఘజియాబాద్‌లో ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. జూలై 12న ఘుక్నా నివాసి శివాని త్యాగి ఆత్మహత్య చేసుకున్న కేసులో సోదరుడి ఫిర్యాదు మేరకు నందగ్రామ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. సూసైడ్ నోట్ ఆధారంగా శివాని సోదరుడు రిపోర్టు ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో శివాని సహోద్యోగులు మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
రిలయన్స్ అధినేత , పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. వివాహానికి ముందు రోజు ‘అంబానీ ఇంట జరుగుతోన్న వివాహ వేడుకలో బాంబు పేలనుంది’ అంటూ ఓ వ్యక్తి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశాడు. దీంతో.. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వేడుక జరగడానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. ఎట్టకేలకు బాంబు బెదిరింపుకు పాల్పడిన వ్యక్తిని ముంబై…
కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. అయితే.. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఉత్తర కన్నడ జిల్లా శిరూర్‌లో మంగళవారం వాహనాలు ప్రయాణిస్తున్న రోడ్డుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తుఫాను బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా.. అద్భుతమైన క్యాచ్లు, స్టంప్స్ చాలా చేశాడు. ఇతని బ్యాటింగ్‌కి వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా.. టీ20 వరల్డ్ కప్ 2024లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు. క్రీజులోకి వస్తే తుఫాన్ ఇన్సింగ్స్ ఆడే పంత్.. బయట ఎంతో ఫన్నీగా ఉంటాడు. చాలా సార్లు పంత్ ఫన్నీ విషయాలను క్రికెటర్లు చెప్పిన వీడియోలను చూశాం. తాజాగా..…
ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి తల్లిగారింటికి వచ్చి.. అత్తమామల ఇంటికి వెళ్లకుండా, తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వారిద్దరూ మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. తమ లవర్స్ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ తిరిగి రావడానికి నిరాకరించారు.
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ చౌక ప్లాన్‌లను అందించేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే అనేక ప్రత్యేక ప్రణాళికలను బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అందిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్రతి టెలికాం కంపెనీ రీఛార్జ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.. దీంతో.. కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ (BSNL) వైపు మళ్లుతున్నారు. దీంతో.. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ కొత్త ప్లాన్‌లను అందిస్తోంది.