కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. అయితే.. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఉత్తర కన్నడ జిల్లా శిరూర్‌లో మంగళవారం వాహనాలు ప్రయాణిస్తున్న రోడ్డుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
Read Also: Puja khedhkar: ట్రైనీ ఐఏఎస్ పూజాకు బిగ్ షాక్.. శిక్షణ నిలిపివేస్తూ ఆదేశాలు
మృతులు 66వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు పక్కనే చిన్నపాటి హోటల్ నడుపుతున్న కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వీరంతా బురదలో కూరుకుపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటంతో.. ఓ గ్యాస్ ట్యాంకర్ కూడా సమీపంలోని గంగావళి నదిలో పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో.. సంఘటన సమయంలో దుకాణం వద్ద టీ తాగుతున్న వాహనం డ్రైవర్, క్లీనర్ కనిపించకుండా పోయారన్నారు. మొత్తంగా కొండ చరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది.
Read Also: Amit Shah: కాంగ్రెస్ ఎప్పుడూ బీసీలకు వ్యతిరేకమే..
కొండ చరియలు విరిగిపడటంతో.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు . కార్వార్ ఎమ్మెల్యే సతీష్ సైల్ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. తనకు అందిన నివేదిక ప్రకారం కొండచరియలు విరిగిపడి గంగావళి నదిలో 10-15 మంది పడే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని నివేదిక కోరామని, దీనిపై తర్వాత చెబుతామని దేవాదాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ సభకు తెలిపారు.