ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి తల్లిగారింటికి వచ్చి.. అత్తమామల ఇంటికి వెళ్లకుండా, తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వారిద్దరూ మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. తమ లవర్స్ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ తిరిగి రావడానికి నిరాకరించారు. వివరాల్లోకి వెళ్తే.. ఠాకూర్‌పారా అడెంగా గ్రామంలో కాళేంద్రి పటేల్ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. తన చెల్లెలు బుధ్యారిన్ పటేల్‌కి కూడా కొద్ది దూరంలో అత్తమామల ఇల్లు ఉంది. అయితే.. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం అక్కాచెల్లెళ్లిద్దరూ తమ అత్తవారింటికి వెళ్తున్నట్లు తమ తల్లిదండ్రులతో చెప్పి.. తమ ప్రేమికుల వద్దకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు.
Read Also: Manorathangal: 9 మంది స్టార్లు.. 9 కథలు.. కమల్ టు మోహన్ లాల్.. డోంట్ మిస్!
కాగా.. తమ వద్దకు వస్తారని చెప్పి రాకపోవడంతో అత్తమామలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు అక్కాచెల్లెళ్ల మొబైల్ లొకేషన్‌లను గుర్తించారు. మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వారి కోసం వెతకగా.. షాజాపూర్‌కు చెందిన సీతారాం పుర్బియాతో ఒకరు.. సిహోర్ జిల్లాలోని శ్యాంపూర్‌కు చెందిన భైరుసింగ్ గల్వితో మరొకరు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఓ షాకింగ్ విషయం బయటపడింది. వారి ప్రేమ కథను పోలీసులకు చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు చెబుతూ.. కొంతకాలం క్రితం అక్కాచెల్లెళ్లిద్దరికీ రాంగ్ కాల్స్ వచ్చాయని.. కాళేంద్రి పటేల్‌కి సీతారాం పూర్బియా, బుద్ధిరిన్ పటేల్‌కి భైరుసింగ్ గల్వీ రాంగ్ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నుంచి వీరి మధ్య ప్రేమకథ మొదలైందని.. అనంతరం అత్తమామల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ప్రేమికుల వద్దకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. అక్కడ అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ప్రేమికులను పెళ్లి చేసుకున్నారన్నారు. కాగా.. ఇద్దరు మహిళల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నట్లు ఠాకూర్‌పర అడెంగా పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని చెప్పారని.. ప్రస్తుతం ఇద్దరూ మధ్యప్రదేశ్‌లోని వేర్వేరు జిల్లాల్లో నివసిస్తున్నారన్నారు. వారు తిరిగి రావడానికి నిరాకరించారని.. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.