ఘజియాబాద్‌లో ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. జూలై 12న ఘుక్నా నివాసి శివాని త్యాగి ఆత్మహత్య చేసుకున్న కేసులో సోదరుడి ఫిర్యాదు మేరకు నందగ్రామ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. సూసైడ్ నోట్ ఆధారంగా శివాని సోదరుడు రిపోర్టు ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో శివాని సహోద్యోగులు మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధి ఘూక్నాలోని హరి నగర్‌లో నివసిస్తున్న గౌరవ్ త్యాగి.. తన సోదరి శివాని త్యాగి నోయిడాలోని యాక్సిస్ హౌస్‌లో పనిచేసేదని చెప్పాడు. కాగా.. జులై 12న శివాని విషం తాగిందని.. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా MMG ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ శివాని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఢిల్లీలోని GTB ఆసుపత్రికి రిఫర్ చేశారు. జీటీబీలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Srisailam Project: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన తెలంగాణ జెన్ కో
గౌరవ్ త్యాగి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్యకు 5-6 రోజుల ముందు శివాని తన సమస్యలను కుటుంబ సభ్యులకు చెప్పింది. జ్యోతి చౌహాన్, మహ్మద్ అక్రమ్, నజ్ముష్ సాకిబ్.. అతనితో పనిచేసే ఇతర సిబ్బంది తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని చెప్పినట్లు సోదరుడు తెలిపాడు. అంతే కాకుండా.. శివాని గదిలో సూసైడ్ నోట్ గుర్తించామని.. అందులో తన మరణానికి కారణమైన వ్యక్తులను పేర్కొందని అన్నాడు. జ్యోతి చౌహాన్ అనే అమ్మాయి గత 5-6 నెలలుగా తనను ఎగతాళి చేస్తూ వేధిస్తున్నదని శివాని సూసైడ్ నోట్‌లో రాసింది. తనపై పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అందులో పేర్కొంది.
Pakistan: పాక్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి.. 8 మంది భద్రతా సిబ్బంది మృతి..
తన సహచరులందరూ తనతో ఫైట్ చేసి ఆనందించేవారని శివాని సూసైడ్ నోట్ లో తెలిపింది. ‘నేను అక్క అని పిలిచే గిరిజ మేడమ్ నాతో డబుల్ గేమ్‌లు ఆడేది. అది నాకు తెలియదు’. నోట్ లో పేర్కొంది. దీంతో చాలా కలత చెందాను.. నా జీవితాన్ని ఇంతటితో ముగిస్తానని తెలిపింది. తనను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివాని తన సూసైడ్ నోట్‌లో డిమాండ్ చేసింది. వీళ్లంతా తనను బలవంతంగా చావమన్నారని పేర్కొంది. ‘ఇలాంటి వాళ్ల వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.’ శివాని తన సోదరుడి పేరు మీద సూసైడ్ నోట్ రాసి, తన బ్యాంకు ఖాతా వివరాలన్నీ చెప్పి.. అమ్మ, నాన్న, చెల్లిని జాగ్రత్తగా చూసుకో.. దోషులను కచ్చితంగా శిక్షించండని సూసైడ్ నోట్ లో తెలిపింది.