గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పది జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ ఐఎండీ అలెర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా.. ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు…
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా.. గ్రూప్-A తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ సూపర్ విక్టరీ సాధించింది. 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 108 పరుగులు చేసింది. దీంతో.. 109 రన్స్ టార్గెట్తో భారత్ రంగంలోకి దిగిన ఈజీగా విక్టరీ సాధించింది. భారత్ బ్యాటింగ్ లో స్మృతి మంధాన అత్యధికంగా (45) పరుగులు చేసింది. ఆ తర్వాత.. షఫాలీ వర్మ (40) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత..…
బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా.. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. శుక్రవారం కోల్‌కతాలో సీఐఎల్ (కోల్ ఇండియా లిమిటెడ్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి.. అనంతరం ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. భారతదేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు.
సచివాలయంలో ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై చర్చించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. అలాగే.. అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ అంగన్ వాడీలలో విద్యాబోధనకు ఒక టీచర్ ను నియమించాలనే…
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నంది. వేగంతో వచ్చిన స్కోడా కారు.. లారీని ఢీ కొట్టింది. దీంతో.. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గ్రూప్-2 పరీక్షల వాయిదాపై టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది టీజీపీఎస్సీ. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 78, 694 సీట్లు ఉండగా 75, 200 సీట్లు కేటాయించారు. అంటే 95.6 శాతం సీట్లు కేటాయించారు. 89 కాలేజీలో వంద శాతం సీట్లు కేటాయించారు. ఇందులో 7 యూనివర్సిటీ కాలేజీలు, 82 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో53, 890 సీట్లు ఉంటే 53, 517 సీట్లు కేటాయించారు.
విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ అధికారులపై, సిబ్బంది పై దాడి చేయడం, విధులు నిర్వర్తించకుండా అడ్డగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ హెచ్చరించారు. నిన్న (గురువారం) బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీ నగర్ లో జరిగిన సంఘటనలో గాయపడిన సిబ్బంది గణేష్, శ్రీకాంత్ మరియు భాస్కర్లను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజినీర్ చంద్ర శేఖర్ను, డివిజనల్ ఇంజినీర్…