టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తుఫాను బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా.. అద్భుతమైన క్యాచ్లు, స్టంప్స్ చాలా చేశాడు. ఇతని బ్యాటింగ్‌కి వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా.. టీ20 వరల్డ్ కప్ 2024లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు. క్రీజులోకి వస్తే తుఫాన్ ఇన్సింగ్స్ ఆడే పంత్.. బయట ఎంతో ఫన్నీగా ఉంటాడు. చాలా సార్లు పంత్ ఫన్నీ విషయాలను క్రికెటర్లు చెప్పిన వీడియోలను చూశాం. తాజాగా.. పంత్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Maar Muntha Chod Chinta: మాస్ పూరీ ఈజ్ బ్యాక్.. మార్ ముంత చోడ్ చింత అంతే!
రిషబ్ పంత్.. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌ను స్విమ్మింగ్ పూల్ లో నెట్టేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో టీ20 ప్రపంచకప్ సమయంలో తీసినట్లుగా తెలుస్తోంది. కాగా.. అది ఇప్పుడు బయటపడింది. ఆ వీడియోలో పంత్ ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. అకస్మాత్తుగా వచ్చి ఖలీల్ వెనుక నుండి కౌగిలించుకుంటాడు. అయితే.. పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఖలీల్ అహ్మద్ పంత్ను కౌగిలించుకుని ఏదో చెప్పాడు. దీంతో.. పంత్ ఖలీల్‌ను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టాడు. వెంటనే ఖలీల్ అందులో పడిపోతాడు. అందులో పడిపోయిన ఖలీల్.. కొంత సేపు పంత్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ తర్వాత.. పంత్ వచ్చి ఖలీల్ కు చేయి అందిస్తాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Raghav Chadha: వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌లో ఆప్ ఎంపీ దంపతుల ప్రత్యక్షం.. కాంగ్రెస్ విమర్శలు
పంత్ గురించి ఫన్నీ విషయాలను అతని సహచరులు చాలా చెబుతుండటం చూశాం. మైదానంలో కూడా పంత్ వికెట్ల వెనుక నుంచి ఫన్నీగా మాట్లాడటం చాలాసార్లు చూశాం. కాగా.. ఈ ఏడాది పంత్ మళ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడు. పంత్ 2022 డిసెంబర్ 30 న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దాని కారణంగా అతను ఒక సంవత్సరం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రపంచ కప్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అతను 3వ ర్యాంక్‌లో బ్యాటింగ్ చేసి జట్టు టైటిల్ విజయానికి గణనీయంగా సహకరించాడు. అతని వికెట్ కీపింగ్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యమైన సందర్భాల్లో పంత్ మంచి క్యాచ్‌లు పట్టాడు.
Pant bhai ye kya kiya 🥵😭 pic.twitter.com/PWIe3jJElC
— Star Boy ⭐ (@Star_boy_55) July 15, 2024