తెలంగాణ ప్రభుత్వం హైడ్రా విధివిధానాలు విడుదల చేసింది. హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా మున్సిపల్ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి ఉండనున్నారు. అంతేకాకుండా.. హైదరాబాద్, రంగారెడ్డి ఇంఛార్జ్ మంత్రులు, జీహెచ్ఎంసి మేయర్, సీఎస్, డీజీపీ, ఎంఎయుడి ప్రిన్సిపల్ సెక్రటరీలు హైడ్రాలో సభ్యులుగా ఉంటారు.
సచివాలయంలో గ్రూప్ -2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్యాసాధ్యులపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ఉద్యోగ ఖాళీలు వెతికి…
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముబైలో సుజాయత్ ఆలీ, అజ్మద్ ఆలీ, షకీల్, ఇద్రీస్లను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ రోజు కేటాయించనున్న తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అర్థరాత్రి కానీ.. రేపు కానీ ఆలాట్మెంట్ ప్రకటించనున్నారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి సమయం పొడిగించడంతో కేటాయింపు ఆలస్యం కానుంది. కాగా.. కన్వీనర్ కోటాలో 72 వేల 741 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. దాదాపు 96 వేల మందికి పైగా విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు.
కాంగ్రెస్ ప్రాక్టికల్ పార్టీ.. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రుణమాఫీ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహూల్ బటన్ నొక్కితే సీఎం రేవంత్ రుణమాఫీ చేశారన్నారు. సినిమాల్లో రైతుల గురించి చూపించి డబ్బులు సంపాదించిన చిరంజీవి.. నల్ల చట్టాల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నల్ల చట్టాలు తెచ్చిన మోడీకి మద్దతు ఇచ్చి.. రైతులకు అండగా ఉన్న రాహుల్ గాంధీకి మద్దతు ఎందుకు ఇవ్వలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం... చేసి చూపెడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అందులో భాగంగా.. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత తమదని అన్నారు. 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కాసేపటి క్రితమే ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఆగష్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా ప్రధాన కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలోని అడవులు, ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడిన దేసాలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల తూటాలకు వీర జవాన్లు ధీటుగా సమాధానం చెప్పారు. కాగా.. ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా, సైనికుడు నాయక్ డి రాజేష్, కానిస్టేబుల్ బిజేంద్ర, అజయ్ సింగ్ గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తన పార్టీకి చెందిన యువ నాయకుడిని కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతోనే వివాదం నెలకొంది. ఈ క్లిప్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రజలు దీనిని చాలా ఖండిస్తున్నారు. ఈ వీడియోలో.. వార్డు నంబర్ 18 మహిళా కౌన్సిలర్ సునంద సర్కార్, వార్డు టీఎంసీ యూత్ ప్రెసిడెంట్ కేదార్ దాస్‌ను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది.