శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు సంబంధించి కీలక సమాచారం అందుతోంది. ఈ టూర్‌లో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌తో పాటు 3 వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శ్రీలంకతో జూలై 27 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్‌లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంకా.. బీసీసీఐ నిర్ణయించకపోయినప్పటికీ.., హార్ధిక్కే పగ్గాలు అప్పజెప్పే ఆలోచనలో ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య చేశారు. రాత్రి స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన బరేలీలోని హఫీజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతి చెందిన యువతిని లక్ష్మి (22)గా గుర్తించారు.
మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలో నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు రావణుడి భక్తుడు. రోజూ రావణుడిని పూజిస్తున్నాడు. అందు కోసం.. అతను తన ఇంట్లో ఒక ఆలయాన్ని నిర్మించాడు. అందులో రావణుడి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం నవ్వుతూ.. ఆశీర్వదించే భంగిమలో ఉంది. అంతేకాకుండా.. 10 తలలు, చేతుల్లో ఇతర ఆయుధాలతో పాటు విల్లు, బాణం కూడా ఉన్నాయి.
నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించినందుకు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నందుకు గత నెలలో యూట్యూబర్ గుజార్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఆ కేసులో కోర్టు అతనికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రాజస్థాన్‌కు చెందిన బన్వరీలాల్ గుజ్జర్‌పై క్రిమినల్ బెదిరింపులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మార్గదర్శకాల ప్రకారం పంజాబ్‌ను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు జరుగుతున్న ప్రచారంలో స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ (SSOC) అమృత్‌సర్ అంతర్-రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణా మాడ్యూల్‌ను బహిర్గతం చేసింది. ఈ ఆపరేషన్‌లో విదేశీ మూలం ఉన్న ఉగ్రవాది లఖ్‌బీర్ అలియాస్ లాండాకు చెందిన ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఆరు అధునాతన .32 బోర్ పిస్టల్స్‌తో పాటు మ్యాగజైన్‌లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అమెరికాలో ఒక వ్యక్తి తన జీవితంలో 172 సార్లు విషసర్పాల కాటుకు గురయ్యాడు. 20 సార్లు అతని పరిస్థితి విషమించింది.. దాదాపు ప్రాణాలు వదిలేసిన పరిస్థితి వచ్చింది. అయినా అతను 100 సంవత్సరాలు బతికాడు. 2011 సంవత్సరంలో ఆయన మరణించాడు. ఈ వ్యక్తిని అమెరికాలో 'స్నేక్ మ్యాన్' అని పిలిచేవారు. అతని పేరు బిల్ హాస్ట్. పదే పదే పాము కాటుకు గురై వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలనుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి పాములంటే ప్రత్యేక ఆకర్షణ ఉండేది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో వికలాంగులను ఎగతాళి చేసినందుకు మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, గురుకీరత్ మాన్‌లపై ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జనసత్తా దళ్ (లోక్తాంత్రిక్) అధ్యక్షుడు, కుంట ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ తండ్రి ఉదయ్ ప్రతాప్ సింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో శాంతియుతంగా ముహర్రం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం గృహనిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా వ్యతిరేకతతో ప్రతాప్ సింగ్ ను గృహనిర్బంధంలో ఉంచుతారు. ఈసారి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
జ్యోతిర్‌మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్‌నాథ్‌లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందని చెప్పారు. 228 కిలోల బంగారం కనిపించడం లేదని అన్నారు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి ఘటనలో కీలక విషయం బట్టబయలైంది. ఘటనా స్థలంలో ఒక్కరు కాదు ముగ్గురు షూటర్లు ఉన్నారు. ట్రంప్‌పై మూడు తుపాకులతో దాడి చేశారు. కాల్పులకు సంబంధించిన ఆడియో ఫోరెన్సిక్ నివేదికలో ట్రంప్ మూడు తుపాకుల నుంచి కాల్పులు జరిపారని పేర్కొంది.