లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ మాజీ హెడ్ డిజైనర్ ఇయాన్ కామెరాన్ దారుణ హత్యకు గురయ్యాడు. జర్మనీలోని తన భవనంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ సమయంలో.. అతని భార్య వెరెనా క్లోస్ పక్కనే ఉంది. ఆమె గోడ దూకి తన ప్రాణాలను కాపాడుకుంది. కాగా.. ఈ ఘటనపై ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం ప్రకారం.. అతను జర్మనీలోని హెర్షింగ్‌లోని లేక్ అమ్మర్సీలో ఉన్న తన విలాసవంతమైన భవనంలో ఈ దాడికి గురయ్యాడు. ఈ ఘటన జూలై 12న జరిగినట్లు సమాచారం.
Sonu Sood video: బోరున వర్షం.. తడుస్తూనే ప్రజలకు సాయం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగుడు జర్మనీలోని ఇయాన్ కామెరాన్ తన $ 3 మిలియన్ల భవనంలో ఉన్నప్పుడు దోపిడీకి ప్రయత్నించాడు. ఈ ఘటనలో దుండుగుడు అతన్ని కత్తితో పొడిచి చంపాడు. హంతకుడిని జుర్ కోల్‌స్టాట్‌గా గుర్తించారు. కాగా.. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతను లేత రంగు ప్యాంటు, ముదురు నీలం రంగు చొక్కా, పసుపు-ఆకుపచ్చ చేతి తొడుగులు మరియు ఎరుపు వీపున తగిలించుకొనే సామాను సంచి ధరించి ఉన్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హంతకుడిని పట్టుకోవడానికి డాగ్ స్క్వాడ్, హెలికాప్టర్ శోధన బృందాలతో పోలీసులు వెతుకుతున్నారు. కాగా.. దాడికి ముందు ఇయాన్ కామెరూన్ గ్యారేజీలో విద్యుత్ వైర్లు డిస్‌కనెక్ట్ అయినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. అనేక విలాసవంతమైన కార్లు కూడా అక్కడ ఉన్నాయని పోలీసులు తెలిపారు.
1998లో రోల్స్ రాయిస్ యొక్క ఆటోమోటివ్ వ్యాపారాన్ని బీఎమ్‌డబ్ల్యూ కొనుగోలు చేసిన తర్వాత.. రోల్స్ రాయిస్ డిజైన్ బృందానికి ఇయాన్ కామెరూన్ నాయకత్వం వహించారు . ఘోస్ట్, ఫాంటమ్ మరియు 3 సిరీస్ వంటి రోల్స్ రాయిస్ మోడళ్ల రూపకల్పనలో అతని పాత్ర ఉంది. ఈ ఘటనపై రోల్స్ రాయిస్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ హత్యతో మేము దిగ్భ్రాంతికి గురయ్యామని, బాధపడ్డామని కంపెనీ తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో తమ ఆలోచనలు అతని కుటుంబంతో ఉన్నాయని పేర్కొంది.