పంజాగుట్టలోని ఓ హోటల్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షాన్‌బాగ్ హోటల్‌లోని ఐదో అంతస్తులో మంటలు ఎగసి పడ్డాయి. కిచెన్‌లోని తందూరి రోటీ బట్టీలోని చిమ్మిలో ఆయిల్ పేరుకు పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేసారు. మరోవైపు.. ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలార్పారు.
Read Also: Chhaava: ‘ఛావా’కి యంగ్ టైగర్ వాయిస్?
ఈ అగ్ని ప్రమాదంపై పంజాగుట్ట సీఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ.. పంజాగుట్టలోని షాన్ బాగ్ హోటల్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. వంటగదికి అనుసంధానమైన చిమ్నీ నుంచి స్వల్పంగా మంటలు చెలరేగాయని.. అప్రమత్తమై ఎమర్జెన్సీ సిలిండర్‌తో సిబ్బంది మంటలు ఆర్పేశారని తెలిపారు. అనంతరం.. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించామని.. తందూరి రోటీ- చిమ్నీలో నూనె చుక్కలు పేరుకుపోవడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయని సీఐ చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శోభన్ కుమార్ తెలిపారు.
Read Also: Solar E- Scooter: స్క్రాప్‌తో 7 సీటర్ సోలార్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ.. ఏకంగా 200 కి.మి రేంజ్!