భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2ను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం.. పంప్ హౌస్ 2 నుంచి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత.. కమలాపురం పంప్ హౌస్ 3ని తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కృష్ణా జలాల పంపిణీలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని ఆరోపించారు. తెలంగాణకు నీటి కేటాయింపులపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసేందుకు సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని చెప్పారు.
Read Also: Gopireddy Srinivasa Reddy: పోసానిపై 14 కేసులా..? మీరు 3 కేసులు పెడితే రేపు 30 పెట్టే సమయం ఉంది..!
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గోదావరి జలాలను కృష్ణా జలతో కలపడం బృహత్తర కార్యక్రమం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు 100 కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మాణంతో పాటు మూడు పంప్ హౌజ్‌లను పూర్తి చేసుకొని లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లిఫ్ట్‌లతో గోదావరి జలాలు తరలిస్తామని చెప్పారు. వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తరలింపుతో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ చెందుతుందని పేర్కొన్నారు. లక్షా 30 వేల ఎకరాల్లో సాగు నీటి ఎద్దడి లేకుండా నీటి తరలింపు చేపడుతామని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Read Also: Allu Aravind: కేరళకి అల్లు అరవింద్.. ఎందుకంటే?