సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు కేసీఆర్ సూచనలు చేశారు. అలాగే.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలకు పలు సూచనలు చేశారు. దీంతో పాటు.. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు.
Read Also: PNB SO Recruitment 2025: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఈ జాబ్స్ మీకోమే.. నెలకు రూ. లక్ష జీతం
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు ఎప్పటికప్పుడూ పలు సూచనలు చేస్తూ.. రాబోయే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వంపై ఎలా పోరాడాలి.. ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఎప్పటికప్పుడూ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు.
Read Also: China: ‘‘డ్రాగన్-ఏనుగు డ్యాన్స్’’.. మారిన చైనా స్వరం, భారత్‌కి స్నేహహస్తం..