హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు సభ్యులు గల ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్‌లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు ముఠా స్కెచ్ వేసింది. ప్లాట్ ఓనర్‌కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించింది ఈ ముఠా. 14 మంది భూ మాఫియాగాళ్ళ ఆట కట్టించారు రాజేంద్రనగర్ పోలీసులు. ఇప్పటికే 7 మంది అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్‌తో పాటు నగదు సీజ్ చేశారు.
Read Also: Maruti Suzuki : మారుతి సుజుకికి చెందిన ఈ ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీపై రూ. లక్ష తగ్గింపు..
ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ శ్రీనివాసులు వెల్లడించారు. 2005లో చెన్నైకి చెందిన వినీత చౌదరి అనే మహిళ పద్మశ్రీ హిల్స్‌లో 600 గజాల భూమిని కొనుగోలు చేసిందని తెలిపారు. గుండా నగేశ్, జ్యూస్ ఇమాన్యూల్‌లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు.. ప్రస్తుతం ఫ్లాట్ వినీతా చౌదరి పేరు మీదే ఉంది. ప్రస్తుతం ఇక్కడ లేదని నగేశ్, ఇమాన్యూల్‌కు చెప్పాడన్నారు. ఇద్దరు కలిసి ఈ ఫ్లాట్‌ను అమ్మాలని అనుకున్నారు.. ఇమాన్యూల్, నగేశ్, దివాకర్ వర్మ ముగ్గురు కలిసి కుట్ర పన్నారని డీసీపీ వెల్లడించారు. నకిలీ జీపీఏను దివాకర్ వర్మ పేరు మీద నగేశ్ క్రియేట్ చేశాడు.. మూసాపేట్‌లోని జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఆ జీపీఏను చెల్లుబాటు చేశారని పేర్కొన్నారు. ఆ జీపీఏ ఆధారంగా సుభాషిణి అనే మహిళకు దివాకర్ సేల్ డీడ్ చేశాడని అన్నారు.
Read Also: Priyanka Chopra: ముంబైలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా?
ఆ సేల్ డీడ్ ఆధారంగా ధృవతార కన్‌స్ట్రక్షన్స్‌కు నాలుగు కోట్ల రూపాయలకు అమ్మేశారని డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ధృవతార కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు గుర్తించారు. ఈ క్రమంలో ఫ్లాట్ యజమాని వినీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోటి అరవై లక్షల రూపాయలు నగదుతో పాటు మూడు కార్లు, ఏడు సెల్ ఫోన్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం ఏడుగురిని అరెస్టు చేశారు.