మెదక్- నిజామాబాద్-కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే కొమురయ్య గెలుపొందారు. మొత్తం 25,041 ఓట్లు పోల్ కాగా.. 24,144 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 897 చెల్లని ఓట్లు ఉన్నాయి. గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్దారించారు. కాగా.. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు.. వంగ మహేందర్ రెడ్డికి 7,182.. అశోక్ కుమార్‌కు 2,621, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు పడ్డాయి.
Read Also: Raviteja: సంక్రాంతి బరిలోకి రవితేజ?
మరోవైపు.. నల్లగొండ – ఖమ్మం – వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. శ్రీపాల్ రెడ్డి 11,821 కోటా ఓట్లు సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో నర్సిరెడ్డి రెండో స్థానంలో.. తర్వాత స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్, మరో స్వతంత్ర అభ్యర్థి పూలరవీందర్ ఉన్నారు. ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి సరోత్తమ్‌రెడ్డి నిలిచారు. మరోవైపు.. కాగా.. మార్చి 27వ తేదీన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి.
Read Also: UAE: యూఏఈలో మరణశిక్ష పడిన యూపీ మహిళకు ఉరిశిక్ష అమలు