కోల్‌కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలని పోలీసులకు తెలిపారు. అలాగే.. ఈ సంఘటన “చాలా బాధాకరమైనది”, “దిగ్భ్రాంతికరమైనది” అని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఇంకొందరున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
Read Also: Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి
“మేము ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి డాగ్ స్క్వాడ్, వీడియో రికార్డ్.. ఫోరెన్సిక్ విభాగాన్ని నియమించాము. ఆదివారం నాటికి కోల్‌కతా పోలీసులు కేసును ఛేదించలేకపోతే, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తాము” అని మమతా బెనర్జీ చెప్పారు. “ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని వెంటనే శిక్షించాలి. ఈ కేసును వేగవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము.. ఎందుకంటే న్యాయ ప్రక్రియ త్వరగా జరుగుతుంది. నర్సులు ఉన్నప్పటికీ ఈ సంఘటన జరగడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.”ఆమె పేర్కొన్నారు. “లోపల ఇంకొందరు ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని నేను పోలీసులకు చెప్పాను. మేము ఈ ఆసుపత్రి ప్రిన్సిపాల్, డిపార్ట్‌మెంట్ హెడ్, మెడికల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ (MSVP), ASPని తొలగించాము” అని సీఎం మమత చెప్పారు.
Read Also: Minister Nadendla Manohar: ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం.. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ము..
కాగా.. ఈ కేసుపై సీబీఐ విచారణ కోరుతూ కోల్కతా హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం (ఆగస్టు 13) కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు.. ఈ ఘటనకు నిరసనగా వేలాది మంది వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డిఎ) సభ్యులు ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని సహా డిమాండ్ చేశారు.