రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అంతేకాకుండా.. జలపాతాల వద్ద సందర్శకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జైపూర్‌కు సమీపంలోని కనోటా డ్యామ్ కూడా నీటి ప్రవాహం భారీగా ప్రవహిస్తోంది. అయితే.. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులు ఈ డ్యామ్ చూసేందుకు వచ్చారు. కాగా.. డ్యాం సందర్శనకు వచ్చిన వారిలో ఐదుగురు యువకులు డ్యామ్ నీటిలో కొట్టుకుపోయారు. అయితే.. డ్యామ్ పై రీల్స్ చేస్తుండగా ఒక యువకుడు జారి నీటి ప్రవాహంలో పడ్డాడు. ఆ యువకుడిని రక్షించేందుకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు.
Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు..? హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై రాహుల్ గాంధీ…
వెంటనే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని గల్లంతైన యువకుల కోసం వెతికారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. గల్లంతైన యువకులు జైపూర్‌లోని శాస్త్రి నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే.. మొదట జారిపడ్డ యువకుడు రాజ్ నీటి ప్రవాహం నుంచి ఎలాగోలా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. అతన్ని కాపాడటానికి వెళ్లిన మిగతా యువకులు హర్ష్, వినయ్, వివేక్, అజయ్, హర్కేష్ గల్లంతయ్యారు. వీరి కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్, సివిల్ డిఫెన్స్ బృందం వెతుకులాట కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే.. జైపూర్‌లో భారీ వర్షాలు దృష్ట్యా సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ విద్యాశాఖను ఆదేశించారు.
Read Also: Rajeev Chandrasekhar: కాంగ్రెస్‌కి ‘‘హిండెన్‌బర్గ్’’ సంబంధం.. ఇది సెబీపై దాడి..