పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్.. క్రీడల్లో ఉండే చిన్న చిన్న నైపుణ్యాలను నేర్చుకుంటుంది. ఇటీవలే ఆమె గుర్రపు స్వారీ, భరతనాట్యం.. స్కేటింగ్ నేర్చుకోవాలని తన కోరికను వ్యక్తం చేసింది. తాజాగా.. ఆమె క్రికెట్ నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ఆదివారం భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని మను భాకర్ పంచుకుంది.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లా బార్మర్ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్, పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. అరెస్టయిన వ్యక్తి పాకిస్తానీ పౌరుడని తెలుస్తోంది.
పిల్లలు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలు అందరిలోనూ వస్తున్నాయి. తాజాగా.. యూపీలోని అమ్రోహాలో యూకేజీ (UKG) చదివే చిన్నారి గుండెపోటుకు బలయింది. ఉన్నట్టుండి తరగతి గదిలో అస్వస్థతకు గురి కాగా.. వెంటనే చిన్నారిని గజ్రాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు ప్రకటించారు.
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయింది. ఆ మహిళ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతుండగా.. ఒక్కసారిగా ఫుట్‌పాత్ కుంగడంతో.. ఆమె డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది.
మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పెన్షన్‌ను రూ.50 వేలకు పెంచుతున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.22 వేలు పింఛన్ అందుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది.
పాకిస్థాన్‌పై విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు.. అటు శ్రీలంకపై విజయంతో ఇంగ్లండ్ కూడా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్ పై పడుకున్నట్లు.. రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అది కూడా.. కింద టవల్, పైన గొడుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ట్రాక్‌పై నిద్రిస్తున్న లోకో పైలట్ సకాలంలో చూసి బ్రేకులు వేసి అతని ప్రాణాలు కాపాడాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. సీపీఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుంది. కేంద్రం ఈ నిర్ణయంతో వీరంతా యూపీఎస్ పరిధిలోకి రానున్నారు.
భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో ఎంజాయ్ చేద్దామనుకుంది భార్య. అందుకోసం అతన్ని ఇంటికి పిలిపించుకుంది. కానీ.. కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఈ ఘటన యూపీలోని మహారాజ్‌గంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరు కావడం కోసం వెళ్ళాడు. ఈ క్రమంలో.. భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ నాగర్ కొత్వాలి ప్రాంతంలోని చిల్బిలా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం యువకుడు బయల్దేరగా.. ప్రియురాలు కూడా తనతో పాటు రైల్వే స్టేషన్ కు వచ్చింది. వారికి ఏ సమస్య వచ్చిందో తెలియదు గానీ.. రైలు దగ్గరికి రాగానే దాని ముందు దూకి సూసైడ్కు పాల్పడ్డారు.