శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) పథకం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ చూసి గర్విస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక ‘X’లో తెలిపారు. ‘ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS).. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోంది. ఈ చర్య వారి సంక్షేమం.. సురక్షితమైన భవిష్యత్తు పట్ల మా ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.’ అని పేర్కొన్నారు.
We are proud of the hard work of all government employees who contribute significantly to national progress. The Unified Pension Scheme ensures dignity and financial security for government employees, aligning with our commitment to their well-being and a secure future.…
— Narendra Modi (@narendramodi) August 24, 2024
Read Also: Crime: షాపింగ్ కి విపరీతంగా డబ్బు ఖర్చు చేసిన భార్య.. సుపారీ ఇచ్చి చంపించిన భర్త
కేబినెట్ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ స్కీమ్ అంటే (యూపీఎస్‌ను) ఆమోదించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సామాన్య పౌరులకు సేవలందిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రైల్వే, పోలీసు, పోస్టల్ సర్వీస్, వైద్యం మొదలైన సేవలలో సామాన్య పౌరులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. దీని వల్ల సమాజ వ్యవస్థ నడుస్తుందని.. సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన స్థానం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ వాటిపై మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పారు.
Read Also: Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్
ఇంటిగ్రేటెడ్ పెన్షన్ స్కీమ్ పథకం వల్ల 25 ఏళ్లు పని చేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. పదేళ్లు సర్వీస్ చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుంది తెలిపారు. అలాగే ఉద్యోగులు సర్వీసులో ఉండగా చనిపోతే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ ఇస్తారు.