దేశ రక్షణ శక్తి నిరంతరం బలపడుతోంది. దీంతో.. రక్షణ శాఖ రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నుంచి సుఖోయ్-30 విమానాలకు సంబంధించిన 240 ఏఎల్-31 ఎఫ్‌పీ ఏరో ఇంజిన్‌ల కొనుగోలుకు రూ.26 వేల కోట్లతో ఒప్పందం కుదిరింది. రక్షణ మంత్రిత్వ శాఖ, హెచ్‌ఏఎల్ సీనియర్ అధికారులు సోమవారం ఒప్పందంపై సంతకం చేశారు.
సోమవారం జరిగిన పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జపాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్.. 5-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనను కనబరిచింది.
వరదల నుంచి కోలుకుంటున్న ఓ గ్రామాన్ని పరిశీలించడానికి వచ్చిన వీఆర్వో, వరద బాధితుడిపై చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటన అజిత్ సింగ్ నగర్ షాది ఖానా రోడ్డులో జరిగింది. వరదలు వచ్చినప్పటీ నుంచి ఫుడ్, కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చెప్పినా.. సచివాలయం 259 వార్డు వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీంతో.. ఇదే విషయంపై వాగ్వివాదం జరగటంతో స్థానికుడిపై ఆగ్రహంతో వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్ కూడా ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం.. ఈ ఇద్దరికీ బెయిల్ మంజూరైంది.
భారతదేశంలోనే కాదు వేరే దేశంలో కూడా గణపతి భారీ విగ్రహం ఉంది. అది ఎక్కడంటే.. థాయిలాండ్, ఖ్లాంగ్ ఖ్వాన్ ప్రాంతంలోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం 128 అడుగులు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా గుర్తింపు పొందింది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బాణాసంచా తయారీ, ఆన్‌లైన్ విక్రయాలపై నిషేధం విధించింది. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 వరకు బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వాడకాన్ని నిషేధించింది.
బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం, హిందువులపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో.. హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. సరిహద్దుల్లో వేలాది మంది హిందువులను భద్రతా అధికారులు అడ్డుకున్నారు.
ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా.. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 21 నెలల తర్వాత రిషబ్ పంత్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్కు కూడా స్థానం లభించింది. అలాగే యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టారు. మరోవైపు.. బౌలర్ యశ్ దయాళ్ను కూడా అదృష్టం వరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో.. వరద ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. ఎప్పటికప్పుడూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.