విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ప్రమాదం తప్పింది. జోరు వానలకు తడిచి గోడలు కూలిపోతున్నాయి. మరోవైపు.. కంచరపాలెంలో రైల్వే గోడ కూలిన ఘటన చోటు చేసుకుంది. దీంతో.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గవర కంచరపాలెంలో ఇళ్లకు ఆనుకొని రైల్వే గోడ ఉండటంతో.. అది కూలి కార్లు, బైక్ లు, కరెంట్ పోల్స్ ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే.. కూలిన రైల్వే గోడ పక్కన వినాయక మండపం ఉంది. గోడ కూలిన సమయంలో వినాయక మండపంలో చిన్నారులు ఉన్నారు.
ఏపీలో మరో బస్సు ప్రమాదం తప్పింది. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి (మం) బోర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. వంతెన పై నుంచి వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
భారతీయ రైల్వే త్వరలో 20 కోచ్‌ల వందే భారత్ రైలును తీసుకురానుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి కొన్ని నిర్దిష్ట మార్గాల్లో నడువనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న రద్దీ, పండుగల దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారత్లో క్రేజ్ పెరుగుతుండడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే చిన్నప్పటి నుండే దీని నివారణ గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి.. జీవనశైలి, ఆహారం రెండూ చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. ఇందులో డైట్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మీరు తినేవి.. తిననివి మీ చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయల్దేరారు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో.. మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో భట్టి విక్రమార్క బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈరోజు మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం భారీ ఎత్తున కురుస్తుండతో ఆందోళన మొదలైంది. ఎగువన కూడా బయ్యారం, గార్ల, మహబూబాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మున్నేరుకి వరద వస్తుంది. దీంతో.. మున్నేరు ముంపు బాధితులను మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
మహిళ భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అవినీతి విషయంలో కళ్ళు తెరిచి చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అంతేకాకుండా. ఆమెకు భారీ నజరానా ప్రకటించారు.
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా 'సి' వర్సెస్ ఇండియా 'డి' మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా 'సి' నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. జట్టు గెలుపొందడంలో స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా సి తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 19.1 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా.. అందులో ఏడు మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ అవసరమని.. అలాంటి వాడైతేనే జట్టులోని ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ సమస్యలను పరిష్కరించగలడని డానిష్ కనేరియా తెలిపాడు. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత.. పాకిస్తాన్ టీంకు వైట్-బాల్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను, టెస్ట్ టీమ్ కోచ్‌గా జాసన్ గిల్లెస్పీని నియమించారు.