Odisha Govt: బంగ్లాదేశీయులు సముద్రం గుండా భారత్‌లోకి ప్రవేశించడంపై ఒడిశా ప్రభుత్వం క్లారిటీ..
- పెద్ద సంఖ్యలో ఇండియాలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయలు
- సరిహద్దుల్లో అడ్డుకుంటున్న భద్రతా అధికారులు
- స్పందించిన ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్
- ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి త్వరలోనే వారి దేశానికి పంపిస్తాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం, హిందువులపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో.. హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. సరిహద్దుల్లో వేలాది మంది హిందువులను భద్రతా అధికారులు అడ్డుకున్నారు. మరోవైపు.. బంగ్లాదేశీయులు సముద్ర మార్గం ద్వారా ఇండియాలోకి ప్రవేశించవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ఎలాంటి నివేదిక అందలేదన్నారు.
Read Also: Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించిట్లే..
Also Read
ఒడిశాలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని హరిచందన్ తెలిపారు. బంగ్లాదేశ్‌తో 480 కి.మీ పొడవైన సముద్ర సరిహద్దు వెంబడి ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్.. ఒడిశా మెరైన్ పోలీసులు మూడంచెల భద్రతను నిర్వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం మధ్య సముద్ర మార్గం ద్వారా బంగ్లాదేశీయులు ఒడిశాలోకి ప్రవేశించే అవకాశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు హరిచందన్ స్పందిస్తూ.. అలాంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కోస్ట్ గార్డ్, ఒడిశా మెరైన్ పోలీసులను ఆదేశించారన్నారు. అంతేకాకుండా.. బీచ్‌లో పెట్రోలింగ్‌కు ఆదేశించినట్లు తెలిపారు.
Read Also: Rishabh Pant: భారత క్రికెట్ అభిమానుల వల్లే ఆ బంతి సిక్స్ వెళ్లలేదు.. టీ20 ప్రపంచకప్‌పై పంత్!
కొందరు బంగ్లాదేశీయులు ఒడిశాలో చాలా కాలంగా నివసిస్తున్నారని హరిచందన్ చెప్పారు. వీసా, వర్క్ పర్మిట్ ఉంటేనే రాష్ట్రంలో ఉండటానికి ప్రభుత్వం ధృవీకరిస్తుందన్నారు. ధృవీకరణ తర్వాత, అక్రమ చొరబాటుదారులను పంపుతామని తెలిపారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఒడిశాలోని ఏడు జిల్లాల్లో మొత్తం 3,740 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించారు. వీరిలో కేంద్రపారాలో 1,649 మంది, జగత్‌సింగ్‌పూర్‌లో 1,112 మంది, మల్కన్‌గిరిలో 655 మంది అక్రమంగా నివసిస్తున్నారు.
- Tags
- bangladeshis
- enter
- india
- Odisha Govt
- sea
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!