గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో.. రానున్న కొద్ది గంటల్లో గోదావరి వరద మరింత పెరగనుంది.
వదర బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు.
హీరో కంపెనీ నుంచి ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్ విడుదల అయింది. ఈ మోడల్ బైక్లో కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను చేర్చింది. స్పెసిఫికేషన్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అలాగే.. లుక్, డిజైన్ చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయి. Xtreme 160R 2V సింగిల్ డిస్క్ వేరియంట్‌తో స్టీల్త్ బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ బైక్ ధర రూ.1,11,111 ఎక్స్-షోరూమ్.
రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. మూడు గండ్లు పూడ్చిన విధానాన్ని మంత్రి నిమ్మల, ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. గండ్ల పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను మంత్రి సీఎంకి తెలిపారు. భవిష్యత్తులో కూడా బుడమేరు డైవర్షన్ కెనాల్, బుడమేరు కాల్వ వల్ల నగరానికి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
విజయవాడలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. వరదలకు విజయవాడ వాసులు అతలాకుతలం అయ్యారు. కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు.. వారం రోజుల పాటు అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై పరిస్థితిని మాములు స్థితికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రి నారాయణ మాట్లాడుతూ, విజయవాడలో గత పది రోజుల క్రితం వచ్చిన వరదలు.. తీవ్ర ప్రభావం చూపించాయన్నారు.
ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి నారా లోకేశ్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతున్నారు.
మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో.. బ్యానర్ గొడవ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో.. జనసేన కార్యకర్త యర్రంశెట్టి నాని, అతని బావపై టీడీపీ కార్యకర్త దాడి చేశారు. ఈ దాడిలో శాయన శ్రీనివాసరావు గాయపడ్డారు.
చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుడమేరు, కృష్ణానది వరదలను వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవటానికి చంద్రబాబు ఉపయోగించటం దురదృష్టకరమని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ను 3 బోట్లు ఢీకొన్న ఘటనకు వైసీపీ కుట్ర కారణమని చంద్రబాబు అపవాదు వేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అంబటి రాంబాబు పేర్కొన్నారు.