ఏలేరు వరద ముంపుపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కోరారు. రైతులకు భరోసా కల్పించండి.. వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని తెలిపారు. ఏలేరు వరద ముంపు ప్రభావితమైన 21 మండలాల్లోని 152 గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను ఇంజనీర్లను తొలగిస్తున్నారు. రెండు భారీ క్రేన్లతో బోట్లను తొలగిస్తున్నారు. బ్యారేజీకి ప్రమాదం లేకుండా బోట్లను నది ప్రవాహం వైపు పంపే ప్రయత్నం చేస్తున్నారు. బోట్లను వైర్లతో లాక్ చేసి నదిలో వంగిపోయిన బోటును రివర్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత.. బోటును డైరెక్షన్ మార్చేందుకు చూస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. కోర్టు తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు శునకానందాన్ని పొందుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తే నీతి.. వేరే వాళ్ళు చేస్తే అవినీతి అన్నట్టు ఉందని విమర్శించారు. అనర్హత వేటు పడుతుంది.. ఉప ఎన్నికలు వస్తాయి.. ఇవ్వన్నీ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదని వ్యాఖ్యానించారు.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని బాధితురాలి తల్లి ఆరోపించింది. తనకు పరిహారం కూడా అందజేస్తామని చెప్పినట్లు పేర్కొంది. కాగా.. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలను మమత ఖండించారు.
సాయంత్రం అయిందంటే వీధుల్లోకెళ్లి ఏదొక స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు. రోజు క్రమం తప్పకుండా వెళ్లి తినేవారు చాలా మంది ఉన్నారు. రుచికి బాగుండటంతో వాటికే అలపడి రోజూ కడుపులో పడేస్తారు. అయితే.. ఆ స్నాక్స్ తింటే మన ప్రాణానికి ప్రమాదమని మీకు తెలుసా..! ఎందుకంటే వాటిల్లో ఉండే.. సంతృప్త కొవ్వులు, చక్కెర, లవణాలు , శుద్ధి చేసిన పిండి కారణంగా అవి చాలా అనారోగ్యకరమైనవి. స్నాక్స్ తినడం వల్ల.. జీర్ణ సమస్యలు, గుండె ప్రమాదం, బరువు పెరుగుతారు.
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది.
పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపొందింది. పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మూడో, చివరి మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్‌లో 0-2తో వెనుకబడిన శ్రీలంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది.
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, అన్ని అవయవాలు మెరుగైన ఆక్సిజన్ పొందడానికి.. శ్వాసక్రియకు సహాయపడే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో.. చాలా మంది తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాంటి సమస్యల బారిన పడినట్లయితే.. సమయానికి నిపుణుల నుండి సలహా తీసుకోండి. లేదంటే.. ఇది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది.
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు సోదరులు తమ ప్రియురాలి కోసం దొంగలుగా మారారు. తన మేకప్, బట్టలు, ఖరీదైన అభిరుచులను నెరవేర్చడం కోసం దొంగ అవతారమెత్తారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. దొంగతనం ఆరోపణలపై ఈ సోదరులను పోలీసులు అరెస్టు చేశారు.