ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్ కూడా ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం.. ఈ ఇద్దరికీ బెయిల్ మంజూరైంది.
Read Also: Lord Ganesh: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా..?
నిందితులిద్దరూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వెలువరించారు. ‘వీరికి బెయిల్ మంజూరు చేయబడింది. 2021-22కిగానూ రూపొందించిన కొత్త మద్యం పాలసీలో తప్పుడు మార్పులు చేయడం ద్వారా వ్యాపారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించి.. వారి నుంచి లంచాలు తీసుకున్నారని సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న ఈ విధానాన్ని అమలు చేసింది. అవినీతి ఆరోపణలతో సెప్టెంబర్ 2022లో దానిని ఉపసంహరించుకుంది.’ అని తెలిపారు.
Read Also: Ganesh Immersion: వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు యువకులు, ఓ బాలుడు గల్లంతు
ఈ ఏడాది ఏప్రిల్ 12న చన్‌ప్రీత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో చన్‌ప్రీత్ ఆమ్ ఆద్మీ పార్టీ క్యాష్ ఫండ్స్‌ని మేనేజ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, సమీర్ మహేంద్రుడిని 2022 సెప్టెంబర్ 28న అరెస్టు చేశారు. సౌత్ గ్రూప్.. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చిందని ఈడీ ఆరోపించింది. ఈ లంచం మొత్తంలో రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించినట్లు ఈడీ పేర్కొంది.