బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో.. వరద ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. ఎప్పటికప్పుడూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ పోలీసు, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా సంప్రదించాలని అధికారులు తెలిపారు.
విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0891-2590102, 0891-2590100
విశాఖ పోలీసు కంట్రోల్ రూమ్ 0891- 2565454
డయల్ 100, 112.
DK Shivakumar: కమలా హారిస్ నుంచి ఆహ్వానం.. డీకే శివకుమార్ క్లారిటీ..
అలాగే.. భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలూ అవసరమైన వారికి తగిన సహాయ సహకారాలను అధికారులు అందించనున్నారు. కంట్రోల్ రూమ్‌లో రెవెన్యూ అధికారులతోపాటు, నీటి పారుదల, పోలీస్, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ఆర్‌డిఓ కార్యాలయాలతోపాటు, అన్ని మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌డి అనిత, జిల్లా విపత్తుల నిర్వహణాధికారి రాజేశ్వరి పరిశీలించారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08922 236947
విజయనగరం డివిజన్ కంట్రోల్ రూమ్: 08922 276888
బొబ్బిలి డివిజన్ కంట్రోల్ రూమ్: 9390440932
చీపురుపల్లి డివిజన్ కంట్రోల్ రూమ్: 7382286268