మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో దారుణ హత్య జరిగింది. లోకల్ బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్ విలాస్ ఠాకూర్ భార్య రాణి ఠాకూర్‌ను గుర్తు తెలియని దుండగుడు గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెట్‌పురా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
Read Also: Bihar Robbery: రూ.25 కోట్ల బంగారు ఆభరణాలు చోరీ.. పోలీసులు కాల్పులు
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భర్త రాంవిలాస్ ఠాకూర్ ఉదయం పొలం వద్దకు వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య రక్తం మడుగులో పడి ఉందని తెలిపాడు. ఈ ఘటనపై భర్త పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో.. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఏఎస్పీ చౌబే మాట్లాడుతూ.. సంఘటన జరిగిన సమయంలో 22 ఏళ్ల కుమార్తె కూడా ఇంట్లోనే ఉందని తెలిపారు. ఈ ఘటనకు కేవలం 10 నిమిషాల ముందు ఆమె స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. ఈ సమయంలో రాణి ఠాకూర్ పై దాడి చేసి చంపాడని పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలం నుండి ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Trivikram: త్రివిక్రమ్’కి హీరో దొరికాడోచ్?
కాగా.. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టపగలే ఈ ఘోరం జరగడంతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణుల బృందం సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడిని త్వరలో అరెస్టు చేస్తామని.. ఈ హత్య వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.