ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్న జడేజా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరారు. పుష్ప మ్యూజిక్, డైలాగ్‌తో అల్లు అర్జున్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. 'జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్' అని జడేజా చెప్పిన డైలాగ్ వీడియోను చెన్నై టీమ్ ట్వీట్ చేసింది.
నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తింది. 50 వేల బస్తాలకు పైగా అమ్మకానికి పసుపు రావడంతో రైతులతో మార్కెట్ యార్డ్ మొత్తం సందడిగా మారింది. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతుంది. ఈరోజు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే టన్నెల్‌లోకి అన్వీ రోబో బృందం వెళ్లింది. డేంజర్ జోన్‌లో రోబోలతో తవ్వే ప్రయత్నం చేశారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు చోట్ల తవ్వకాలు మొదలు పెట్టారు. కాగా.. సాయంత్రానికి రెండు మృతదేహాలు వెలికితీసే అవకాశం ఉంది.
హబ్సిగూడ కుటుంబం మృతి సూసైడ్ నోట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల్ని ఇద్దరిని చంపి లెక్చరర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో చైతన్య కళాశాలల శాఖల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రణయ్ హత్య కేసులో తీర్పుపై అమృత స్పందించారు. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో '10-03-2025' తేదీని లవ్ సింబల్‌తో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. 'రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్' అని రాసి పోస్ట్ చేసింది.
శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC)లో జరిగిన విషాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ (GPR), క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
నేడు ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రానున్నారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.