సూపర్ స్టార్ మహేష్ బాబు – గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’.. ఇప్పటికే ఇండియన్ సినిమాను దాటి వరల్డ్ సినీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. గత నెలలో విడుదలైన గ్లింప్స్‌తోనే సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలు షేక్ అయ్యాయి. ఆ హైప్ ఇంకా తగ్గకముందే, మేకర్స్ ఇప్పుడు మరో సెన్సేషనల్ అప్‌డేట్‌తో ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తున్నారు. కేవలం ఇండియన్ మార్కెట్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రాజమౌళి సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది.
Also Read : TheRajaSaab : నిధి అగర్వాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫ్యాన్స్.. వీడియో వైరల్
కంటెంట్ పరంగా మాత్రమే కాదు, టెక్నికల్‌గా కూడా ‘వారణాసి’ ఇండియన్ సినిమా హద్దులు దాటబోతోంది. ఇండియా నుంచి వస్తున్న రెండో ఐమాక్స్ (IMAX) వెర్షన్ మూవీగా ఈ చిత్రం రికార్డ్ సృష్టించనుంది. సాధారణంగా ట్రైలర్లు డిజిటల్ ఫార్మాట్‌లోనే రిలీజ్ చేస్తారు. కానీ రాజమౌళి టీమ్ మాత్రం డైరెక్ట్‌గా 1.43 ఐమాక్స్ రేషియోలో ట్రైలర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసి సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి ప్లానింగ్, ఇలాంటి విజన్ ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పాలి. మహేష్ – జక్కన్న కాంబోతో ‘వారణాసి’ కేవలం సినిమా కాదు, ఓ గ్లోబల్ ఈవెంట్‌గా మారబోతోందన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Check out the 1.43 trailer for the newest movie from RRR and Baahubali director S. S. Rajamouli: VARANASI, coming in 2027. pic.twitter.com/aTS7fselW8
— IMAX (@IMAX) December 18, 2025