భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ భవిష్యత్తు గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. ఇకపై తన ఆటను మెరుగుపరుచుకోవాలనే కోరిక లేనప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని అశ్విన్ చెప్పాడు. రిటైర్మెంట్ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అని అశ్విన్ అన్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అని అనన్య పాండే చెప్పింది. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘కాల్ మీ బే’ ప్రమోషన్లలో భాగంగా అనన్య ఈ వ్యాఖ్యలు చేశారు.
దులీప్ ట్రోఫీలో భారత యువ ఆటగాళ్లు ధీటుగా రాణిస్తున్నారు. దేశవాళీ టోర్నీ రెండో రౌండ్ ప్రారంభమైంది. ఇండియా A, ఇండియా D మధ్య గట్టి పోటీ కనిపించింది. ఇండియా B, ఇండియా C తలపడుతున్నాయి. శనివారం భారత్ D ముందు 488 పరుగుల లక్ష్యం ఉంది. ఈ క్రమంలో.. స్టంప్స్ సమయానికి యష్ దూబే15 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, రికీ భుయ్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మీరట్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకీర్ కాలనీలో 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో.. కుటుంబం మొత్తం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు. ఇంట్లో ఉన్న 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం.
ఇండోర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేశాడు. నిందితుడు మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్‌లో గ్లాస్‌ని చొప్పించాడు. ఆ బాధతో అతి కష్టం మీద పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేశారు.
సూర్య భార్య దేవిషా శెట్టి తన భర్త పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నిండిన ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవిష పెట్టిన పోస్ట్‌కి సూర్య ఒక్క మాటలో సమాధానమిచ్చి తన భావాలను మొత్తం బయటపెట్టాడు.
అత్యధిక సిక్సర్లు బాదిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం ఉంది. కేవలం ఐదు సిక్సులు కొడితే.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా ఆటగాడిగా అవతరిస్తాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.
యమహా మోటార్ భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌లో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. కొత్త ఫీచర్లు చేర్చారు. మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.1,98,300 లభిస్తుంది. కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ రూ.2,08,300కి అందుబాటులో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. R15M బైక్ బాడీవర్క్ కార్బన్ ఫైబర్ నమూనాతో తయారు చేశారు.
గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు కూడా ఏ టోర్నీ కోసం ఇండియాకు వెళ్లదని అని అన్నాడు.