దులీప్ ట్రోఫీలో ఇండియా 'ఎ' జట్టు ఇండియా 'డి'తో తలపడుతోంది. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ఎ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. ఈ క్రమంలో.. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఇండియా డి జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేసింది. అయితే.. ఈ మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఏడు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. అయితే..…
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే.. ఇది మీ కోసమే. 5 గొప్ప కంపెనీలకు సంబంధించిన రూ.15 వేల రేంజ్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి. అందులో.. సాంసంగ్, ఎల్జీ లాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ టీవీలలో మీరు డాల్బీ ఆడియోతో క్లారిటీ స్క్రీన్ను పొందుతారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అండర్‌పాస్‌లో నీరు నిలిచి ఉండటంతో.. అది గమనించని ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నీరు నిలిచిపోవడంతో వారి ఎస్‌యూవీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వారు బయటకు రాలేక కారులోనే ఉండటంతో ఊపిరాడక మరణించారని పోలీసులు శనివారం తెలిపారు.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ విక్టరీ సాధించింది. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఇప్పటికే వరుస విజయాలతో సెమీస్కు చేరిన భారత్.. నామమాత్రపు మ్యాచ్లో పాకిస్తాన్ ను ఓడించింది. 2-1 ఆధిక్యంతో గెలుపొందింది.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్ క్రికెట్ జట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్‌మోహన్ రావు భారీ నజరానా ప్రకటించారు. ఏడేళ్ల తర్వాత టైటిల్ సాధించిన ఆటగాళ్లకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్టు జగన్‌మోహన్ రావు ప్రకటించారు.
ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. మంచి నాయకుడు, ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి అని అన్నారు. తాను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరిని వాచ్ చేశానని.. ఏచూరితో కలిసి పని చేశానని చంద్రబాబు చెప్పారు.
మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏలేరు రిజర్వాయర్కు అంత పెద్దమొత్తంలో వరద వచ్చినా ప్రాణ నష్టం జరగలేదంటే ప్రభుత్వ అప్రమత్తతే కారణమని మంత్రి పేర్కొన్నారు. 114 చోట్ల కట్ట బలహీనతలు గుర్తించి పటిష్టపరిచి ఆస్తి నష్టాన్ని తగ్గించామని తెలిపారు. ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే స్థాయి జగన్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి కనుమదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సమాచారం అందిందని తెలిపారు.
రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై రివ్యూ చేపట్టారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి బిసి జనార్థన్ రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) రాష్ట్రంలో ఆయుష్ సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మున్నెన్నడూ లేనివిధంగా రూ.90 కోట్ల 84 లక్షలు నిధులు అందించడానికి సమ్మతి తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆయుష్ విభాగానికి సమాచారం అందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం వెల్లడించారు. 2019-24 కాలంలో ఆయుష్ విభాగానికి కేవలం రూ. 38 కోట్లు మాత్రమే కేంద్ర నిధులు లభించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తమ విజ్ఞప్తి మేరకు కేంద్ర సాయాన్ని భారీగా పెంచడానికి…