బీహార్‌లోని గయాలో పెను రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం గయా-కోడెర్మా రైల్వే సెక్షన్‌లోని కొల్హానా హాల్ట్ మధ్య జరిగింది. ఇంజిన్‌ను లూప్‌లైన్ నుంచి గయా వైపు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఇంజన్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే ఇంజిన్‌తో కూడిన కోచ్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Read Also: Rain Alert: ఈ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పొలాల్లో పని చేసేవాళ్లు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఇంజిన్ అదుపు తప్పి లోకో పైలట్ కిందపడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఇంజిన్ వేగం తగ్గడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ క్రమంలో.. ఇంజిన్ పాక్షికంగా దెబ్బతింది.
Read Also: Actor Darshan: దర్శన్ తీరుపై బళ్లారి జైలర్ సీరియస్.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక..
గత కొన్ని రోజులుగా భారతీయ రైల్వే నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు రైలు ప్రమాదాలు జరగ్గా, కొన్నిసార్లు రైళ్లు పట్టాలు తప్పాయి. మరోవైపు.. ఈ ప్రమాదం ట్రాక్ మారడం వల్లే ఇంజన్ పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనపై రైల్వే బృందం విచారణ చేపట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రైల్వే ట్రాక్‌పై కూడా పరిస్థితి సాధారణంగానే ఉంది. రైల్వే బృందం గంట వ్యవధిలో గూడ్స్ రైలుకు మరమ్మతులు చేసింది.