తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును నిర్వాహకులు ఆహ్వానించారు.
Read Also: Bangladesh: “ఉర్దూ, జిన్నా” వైపు బంగ్లాదేశ్ అడుగులు.. స్వాతంత్య్ర లక్ష్యాలని మరిచిపోతున్నారు..
ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ 200వ వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఆహ్వానంలో తెలిపారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.
Read Also: Navdeep Singh: నీ వల్ల ఏదీ సాధ్యం కాదు.. ఆత్మహత్య చేసుకోమన్నారు
ఈ ఆహ్వానంపై డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క స్పందించారు. సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానం అందటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానం అందటం.. తనకు ఎంతగానో గర్వకారణమని అన్నారు.