బీహార్‌లోని షేక్‌పురాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. నేరస్థులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని కళ్లను పీకేసి చంపారు. అంతేకాకుండా.. మృతుడి ఆధారాలు కనిపెట్టకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని యాసిడ్ పోసి కాల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన షేక్‌పురా జిల్లా ధరేని గ్రామంలో చోటు చేసుకుంది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 149 పరుగుల వద్ద బంగ్లా ఆలౌట్ అయ్యింది. దీంతో.. భారత్ 227 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి బంగ్లా ఆటగాళ్లను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండేసి వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో అత్యధికంగా షకీబ్ అల్ హసన్ (32), మెహిదీ హాసన్ మిరాజ్ (27), లిటన్ దాస్ (22) పరుగులు చేశారు.
పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఒక నేరస్థుడు తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. తనను పోలీసులు పట్టుకుంటారని తెలుసుకుని.. ఓ నేరస్థుడు ఢిల్లీలోని యమునా క్రాసింగ్ ఏరియాలోని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించేలా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన పెన్షన్ల గుర్తించేందుకు మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. కొందరు అనర్హులు కూడా సామాజిక పెన్షన్లు తీసుకొంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. సెక్రటేరీయేట్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రెండో విడత అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్, గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్, గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లల్లో టోకెన్లు తీసుకుని పేదలకు ఇచ్చారు సీఎం చంద్రబాబు. అనంతరం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పేదలకు భోజనం వడ్డించారు.
ప్రియుడు కోసం ఇద్దరు యువతులు కొట్లాటకు దిగారు. నా వాడంటే నా వాడంటూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ అనే బిల్డర్ కోసం కొట్టుకున్నారు ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి.. అనూష అనే ఓ యువతి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల చంద్రబాబు పాలనలో ఆరుసార్లు క్యాబినెట్ సమావేశమైనా.. ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని విమర్శించారు. పన్నులు వేయటం, జనాన్ని పీక్కుతినటం తప్ప మరేమీ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు వచ్చారు, పన్నులు పెంచారు.. చంద్రబాబు వచ్చారు, జనాన్ని వరదల్లో ముంచారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ చర్చించారు. పవన్‌తో భేటీ అనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు.
విజయవాడ క్యాంప్ ఆఫీస్‌లో ఆపరేషన్ బుడమేరుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జలవనరుల శాఖ ఈఎన్సీ, ఎస్.ఇ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ, సర్వే అధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. బెజవాడ దుఃఖ దాయనిగా పిలవబడుతున్న బుడమేరుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికపై సమీక్ష నిర్వహించామని తెలిపారు.