ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐపీఎల్ (IPL)లో పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కాగా.. ఐపీఎల్ 2024 తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని విడిచిపెట్టింది. ఈ క్రమంలో.. పాంటింగ్‌కు పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. పాంటింగ్ చాలా కాలం పాటు ఢిల్లీ జట్టుకు హెడ్ కోచ్‌గా కొనసాగాడు. కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ క్రమంలో.. జట్టు అతన్ని వదిలేసింది. మరోవైపు.. రికీ పాంటింగ్‌తో పంజాబ్ కింగ్స్ భారీ ఒప్పందం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ రికీ పాంటింగ్‌తో భాగస్వామి కాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో.. పాంటింగ్ ప్రధాన కోచ్‌గా నియమితులైనట్లు అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
Read Also: Russia: ఆఫీసు సమయంలో సె** బ్రేక్!.. పుతిన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
ఐపీఎల్ 2025కి ముందు పంజాబ్ కింగ్స్ కి ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్ నియమితులైనట్లు ESPNcricinfo ధృవీకరించింది. ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఉన్న పాంటింగ్.. రెండు నెలల క్రితమే బయటికొచ్చారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్ జట్టుతో కొన్ని సంవత్సరాల పాటు పని చేసేలా ఒప్పందంపై సంతకం చేశాడు. కాగా.. జట్టు మిగిలిన కోచింగ్ స్టాఫ్‌పై పాంటింగ్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గతేడాది నుంచి కోచింగ్ యూనిట్‌లో ఎవరెవరు మిగిలారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
Read Also: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇక, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం..!
కాగా.. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ట్రెవర్ బేలిస్ హెడ్ కోచ్‌గా ఉన్నారు. సంజయ్ బంగర్ క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్‌గా, చార్లెస్ లాంగెవెల్డ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా.. సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ నాలుగు సీజన్లలో ముగ్గురు హెడ్ కోచ్‌లను మార్చింది. 2024 సీజన్‌లో జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2014 నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్‌కు పంజాబ్ అర్హత సాధించలేదు. అయితే.. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ని అధిగమించే బాధ్యత రికీ పాంటింగ్‌దే. పాంటింగ్‌కు మొదటి అసైన్‌మెంట్ ఏమిటంటే.. అతను ఏ ఆటగాళ్లను రిటైన్ చేస్తాడు.. ఎవరిని విడుదల చేస్తాడు. మెగా వేలంలో టార్గెట్ ఏ ఆటగాళ్లపై ఉంటుందనేది.